BJPతో పొత్తుల యవ్వారం తేలేనా..
విధాత: ఆటో ఇటో ఎటో తేల్చేస్తాను అంటూ ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంకా కీలకమైన బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ పొందలేకపోయారు. మురళీ దేవధర్, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మినహా పార్టీ పెద్దలు ఎవరూ పవన్ను పెద్దగా లెక్కచేసినట్లు లేదు. ఇంకా అమిత్ షా వంటి వారితో భేటీలు కుదరలేదు.
వారు కావాలని పవన్ను ఇగ్నోర్ చేస్తున్నారో, నిజంగానే బిజీగా ఉన్నారో తెలియడం లేదు. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్పష్టం అవుతోంది. వాస్తవానికి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని ఒక్క మాటైనా చెప్పలేదు.
ఇదే విషయాన్నీ బీజేపీ అభ్యర్థి మాధవ్ బహిరంగంగా ప్రస్తావించి పవన్ను నిందించారు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు రానివ్వాలని అనుకున్నారో, లైట్ తీసుకో అనుకున్నారో కానీ పవన్ కు అనుకున్న, ఆశించిన ప్రాధాన్యం దక్కలేదు.
బీజేపీ, టీడీపీ(TDP) జనసేన కలిసి వెళ్లాలని భావిస్తున్నట్లు బీజేపీ పెద్దలకు సమాచారం ఉంది. అయితే వారికీ మాత్రం చంద్రబాబు అంతే అసలు గిట్టడం లేదన్నది సుస్పష్టం. ఇలాంటి తరుణంలో యమర్జంటుగా పోతుల విషయం తేల్చేసి పవన్‌ను కూల్ చేసి పంపాల్సిన అవసరం బీజేపీకి లేదన్నది తెలుస్తూనే ఉంది.
వాస్తవానికి నిప్రస్తుతం బీజేపీ(BJP) పెద్దలు కర్ణాటక ఎన్నికలు పార్లమెటు వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో పవన్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఢిల్లీ వెళ్లి అందర్నీ కలిసేసి మొత్తం సెట్ చేసేస్తాను అనుకోవడం భ్రమ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వాన్ని కాలదన్ని గమ్మున టిడిపిని నెత్తిన పెట్టుకోవలసిన అవసరం కూడా బిజెపి పెద్దలకు కనిపించడం లేదు.
కాబట్టి ఇప్పటికిప్పుడు పవన్‌తో (Janasena)పొత్తుల గురించి చర్చించే తీరిక అక్కడ లేనందున పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఎలాగు వచ్చాము కాబట్టి పోలవరం మీద మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వంటి వారిని అలా కలిసి ఫోటో దిగి వినతిపత్రం ఇచ్చేస్తే ఒక పని ఐపొద్దని నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ భావించి ఆ మేరకు మంత్రిని కలిసినట్లు చెబుతున్నారు.
మొత్తానికి ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎకాయెకి సాధించే ఫలితాలు ఈమె లేవని అంటున్నారు. జేపీ నడ్డాను కలిసినా అది నామమాత్రమే. ఆయన ఎలాగూ పొత్తుల గురించి నిర్ణయం తీసుకునే స్థాయి ఉన్న వ్యక్తి కాదు.. అమిత్ షా మినహా మిగతావారు ఎవరిని కలిసినా పెద్దగా కలిసొచ్చే ప్రయోజనం ఏమి లేదని జనసేన కార్యకర్తలు అంటున్నారు.