Jagityala: తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని.. ఆంధ్ర కూలీలను రమ్మంటున్నారా?: జీవ‌న్‌రెడ్డి

దళిత బంధు నిధుల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి పరిశ్రమలు తెచ్చామన్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించారు టెస్కాబ్ చైర్మన్‌కు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదు ఇథనాల్ విష వాయువులతో ఇథనాల్ ఫ్యాక్టరీ చంపేస్తారా? జగిత్యాల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విధాత, కరీంనగర్ బ్యూరో: ఆంధ్ర నుంచి వలస కూలీలంతా తెలంగాణకు వచ్చి ఓటు హక్కు తీసుకోవాలన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చతురోక్తులు విసిరారు. కేసీఆర్ ఆయన […]

Jagityala: తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని.. ఆంధ్ర కూలీలను రమ్మంటున్నారా?: జీవ‌న్‌రెడ్డి
  • దళిత బంధు నిధుల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి
  • పరిశ్రమలు తెచ్చామన్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించారు
  • టెస్కాబ్ చైర్మన్‌కు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదు
  • ఇథనాల్ విష వాయువులతో ఇథనాల్ ఫ్యాక్టరీ చంపేస్తారా?
  • జగిత్యాల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

విధాత, కరీంనగర్ బ్యూరో: ఆంధ్ర నుంచి వలస కూలీలంతా తెలంగాణకు వచ్చి ఓటు హక్కు తీసుకోవాలన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చతురోక్తులు విసిరారు. కేసీఆర్ ఆయన టీమ్‌ను తెలంగాణ ప్రజలెలాగూ నమ్మడం లేదు కాబట్టే.. ఆంధ్రా వాళ్లను రమ్మని ఓటు హక్కు తీసుకోమంటున్నారేమోనంటూ సందేహం వెలిబుచ్చారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 2022-23 రాష్ట్ర శాసనసభ బడ్జెట్ లో 17 వేల 700 కోట్లను దళితబంధు కోసం కేటాయించారని, అయితే నియోజకవర్గానికి 15 వందల చొప్పున దళిత నిరుద్యోగ బిడ్డలెందరికి దళితబంధు అందిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప‌రిశ్ర‌మ‌ల్లో తెలంగాణ యువ‌త వాటా ఎంత‌?

రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చామని గొప్పలు పోయే మంత్రి కేటీఆర్… ఆ పరిశ్రమల్లో తెలంగాణ నిరుద్యోగ యువత వాటా ఎంతో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ‘మేం లేకపోతే బతుకలేరని ఆంధ్రోళ్లంటుంటే ఇక్కడి మంత్రులు సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటివరకూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ప్రజలను ముంచిన కేసీఆర్.. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ విషవాయువులతో వారిని చంపేందుకు సిద్ధమయ్యాడంటూ ఆరోపించారు.

ఇథనాల్ ఫ్యాక్టరీతో మండ‌ల ప్ర‌జ‌ల ఆందోళ‌న‌

కాలుష్య ప్రభావితమైన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తలపెట్టినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని ఆయన అన్నారు. వెల్గటూర్ మండలంలో గ్రామస్తుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండానే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూడడంలో అర్థం లేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మండల ప్రజలను ఆందోళనలకు గురి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అక్కడి ప్రజలు చేపట్టిన ఆందోళనలను అర్థం చేసుకోవాలని కోరారు.

టెస్కాబ్ చైర్మన్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి

టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నేతల శరణు చొచ్చిన కొండూరి రవీందర్ రావుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అస‌లు ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదన్నారు.
రైతుల రుణాలపై కేంద్రం మూడు శాతం, రాష్ట్రం నాలుగు శాతం కల్పించిన రాయితీ ఎటు పోతుందని ప్రశ్నించారు? దీర్ఘ మధ్యకాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ మాటేమిటని నిలదీశారు.

జాడ లేని రుణ‌మాఫీ.. వ‌డ్డీ మాఫీ..

రైతుల రుణమాఫీని దశలవారీగా పూర్తి చేస్తామని, మొదటి సంవత్సరం 25000, రెండవ సంవత్సరం 50,000, మూడవ సంవత్సరం 75000, నాలుగవ సంవత్సరం లక్ష చొప్పున మాఫీ చేస్తానని చేసిన ప్రకటనలు ఎక్కడ పోయాయని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలోని రైతులకు ఇప్పటివరకు కేవలం 37 వేల రూపాయల రుణమాఫీ మాత్రమే చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రతినిధిలా మాట్లాడుతున్న రవీందర్రావు రుణమాఫీ, రుణాలపై వడ్డీ మాఫీపై నోరు విప్పాలన్నారు. ఆ తరువాతే ఆయనకు రైతుల గురించి మాట్లాడే నైతికత ఉంటుందన్నారు.