సమ్మె విరమించిన ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు

  • Publish Date - January 2, 2024 / 11:25 AM IST
  • పెట్రోల్, డీజిల్ కొరతతో జనం అవస్థలు


విధాత : భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ ఆండ్ రన్ కేసులో కఠిన శిక్షలను నిరసిస్తూ మంగళవారం రెండో రోజు కూడా ట్రాన్స్‌పోర్టు వాహన డ్రైవర్లు చేపట్టిన సమ్మెను సాయంత్రం 4.30గంటలకు విరమించారు. సమ్మెలో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్‌, డీజిల్ బంక్‌ల వద్ద నిల్వలు అయిపోవడం..నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వినియోగదారులు బంక్‌ల వద్ద బారులు తీరి ఇక్కట్లు పడ్డారు.


అయితే నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమ్మెను ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు విరమించుకోవడంతో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కంపనీల నుంచి ఇంధనం నింపుకుని బంక్‌ల వద్ధకు బయలు దేరారు. దీంతో జనం, ముఖ్యంగా వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు భారీ ఊరట చెందారు. భారత న్యాయ సంహిత చట్టం మేరకు హిట్ అండ్ రన్ కేసులో రూ.7లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు, ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టి రెండో రోజు విరమించుకున్నారు.