బాసూ.. నా పేరు రాద్దూ! జిల్లాల్లో పీకే టీమ్ హవా !
ఆశావహులు ముమ్మరం చేసిన ప్రయత్నాలు విధాత: పేనుకు పెత్తనం ఇస్తే బుర్రన్తా గొరిగి పెట్టిందట.. అలా ఉంది ఆంధ్రాలో ప్రశాంత్ కిషోర్ టీమ్ హవా.. గత 2019 ఎన్నికల్లో పీకే టీమ్ సలహాలు, రికమెండేషన్లు …స్ట్రాటజీలు బాగా వర్కవుట్ కావడం ఏకంగా 151 సీట్లు దక్కడంతో జగన్ కు ఇప్పుడు మళ్లీ వాళ్ళ మీద గురి కుదిరింది. అందుకే రానున్న ఎన్నికలకు సైతం అదే టీమ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అంటే జిల్లాల్లో ఆయా టీములు పర్యటిస్తూ […]

- ఆశావహులు ముమ్మరం చేసిన ప్రయత్నాలు
విధాత: పేనుకు పెత్తనం ఇస్తే బుర్రన్తా గొరిగి పెట్టిందట.. అలా ఉంది ఆంధ్రాలో ప్రశాంత్ కిషోర్ టీమ్ హవా.. గత 2019 ఎన్నికల్లో పీకే టీమ్ సలహాలు, రికమెండేషన్లు …స్ట్రాటజీలు బాగా వర్కవుట్ కావడం ఏకంగా 151 సీట్లు దక్కడంతో జగన్ కు ఇప్పుడు మళ్లీ వాళ్ళ మీద గురి కుదిరింది.
అందుకే రానున్న ఎన్నికలకు సైతం అదే టీమ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అంటే జిల్లాల్లో ఆయా టీములు పర్యటిస్తూ ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది.. ఎక్కడ వీక్‌గా ఉంది.. అక్కడి అభ్యర్థి పరిస్థితి ఏమిటి.. ఆయన్ను మార్చాల్సి వస్తే నెక్స్ట్ బెటర్ క్యాండిడేట్ ఎవరూ అన్నది రిపోర్ట్స్ ఇస్తుంది.
వాటన్నిటినీ మదింపు చేసుకుని, ఇంకా వేర్వేరు మార్గాల నుంచి కూడా నివేదికలు తీసుకుని టికెట్ ఇచ్చే విషయంలో జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్స్, జగన్ సొంత టీమ్ రిపోర్ట్స్ ఎన్ని ఉన్నాకానీ పీకే టీమ్ ఇచ్చే నివేదికలకు జగన్ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ బృందం సభ్యుల హవా జిల్లాల్లో బాగా నడుస్తోంది.
ఇప్పటికే ఓ ముప్పయిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇచ్చేది లేదని లేదా పనితీరు మార్చుకోవాలని జగన్ సూచించడంతో ఆ 30 మంది ఎవరన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా అన్ని నియోజకవర్గాల్లోనూ రెండో క్యాడర్లోని ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మా ఎమ్మెల్యేను గానీ లేపేస్తే నాకు ఛాన్స్ ఇస్తారేమో ఈలోగా పార్టీలోని ఇతర లీడర్లను మచ్చిక చేసుకుందాం.. ఇంకా పీకే టీములోని కుర్రాడ్ని లైన్లో పెట్టేస్తే సరిపోద్దని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కొందరు ఆశావహులు పీకే టీమ్ సభ్యులకు డబ్బును ఎరగా వేసి ప్రాబబుల్స్ లిస్ట్ లో నాపేరు ఉండేలా చూడు తమ్ముడూ అంటూ లక్షల్లో డబ్బు ఇస్తున్నారని తెలిసింది.
ఇంకా పార్టీలోని ఇంకొందరు మిత్రులు, మండల స్థాయి నాయకులకు ఫోన్లు చేసి బ్రదరూ ఈసారి టికెట్ గురించి ఎంక్వయిరీ గట్రా జరిగి పార్టీ నుంచి ఫోను వస్తే నా పేరు చెప్పు గురూ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పీకే టీమ్ కుర్రాళ్ళకు డిమాండ్ పెరిగింది.
ఆంధ్రా పాలిటిక్స్ అంటేనే బాగా ఖరీదైనవి కాబట్టి తమ పేరును ప్రాబబుల్స్ లిస్టులో పెట్టాలని కోరుతూ డబ్బును అందిస్తున్నారు. దీంతో పీకే టీమ్ కుర్రాళ్ళు అటు జీతానికి జీతం.. పైగా ఇలా భారీగా బయటి ఆదాయం దక్కుతుండడంతో ఖుషి అవుతున్నారు.