PM MODI | New Parliment
కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతిపథాన పయనిస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పార్లమెంటు.. ప్రజాస్వామ్య దేవాలయం. ఇది భవనం మాత్రమే కాదు.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతీక. భారత్ అభివృద్ధి.. ప్రపంచ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది.
చరిత్రాత్మక సమయంలో సెంగోల్ ప్రతిష్టాపన జరిగింది. కర్తవ్యం.. సేవకు ప్రతీకగా సెంగోల్ నిలుస్తుంది. సభ కార్యకలాపాల వేళ సెంగోల్ ప్రేరణగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్. ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది అని అన్నారు.
ఇక్కడ జరిగే నిర్ణయాలు భారత్ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వంచిత, పీడిత వర్గాలకు ఇక్కడి నుంచి న్యాయం జరగాలన్నారు. ఇక్కడ చేసే చట్టాలతో భారత్ మరింత పురోభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. భారత్ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పార్లమెంటు భవనం అనేక సంస్కృతులకు సమ్మేళనం. భవనం ప్రతి అణువులో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావన ఉన్నదని ప్రధాని వ్యాఖ్యానించారు.పాత భవనంలో సభ్యుల కార్యకలాలపాలకు ఇబ్బందిగా ఉండేది. భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త పార్లమెంటు నిర్మాణం. ఆధునిక, సాంకేతికలతో కూడిన కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడిందన్నారు.