Mohsin Shaikh | మ‌ళ్లీ మా సోద‌రుడే ప్ర‌ధాని.. మోదీకి 30 ఏళ్లుగా రాఖీ క‌డుతున్న పాక్ మ‌హిళ విశ్వాసం

Mohsin Shaikh | విధాత‌: కొవిడ్ వ‌ల్ల వ‌చ్చిన మూడేళ్ల విరామం త‌ర్వాత మోదీ (Narendra Modi) ని నేరుగా క‌లిసి రాఖీ క‌ట్ట‌నున్న‌ట్లు పాక్ మ‌హిళ (Pak Woman) మోషిన్ షేక్ వెల్ల‌డించారు. భార‌త్ యువ‌కుడిని పెళ్లి చేసుకుని దశాబ్దాల క్రిత‌మే ఆమె గుజ‌రాత్‌కు వ‌చ్చేసిన ఆమె.. సుమారు 30 ఏళ్లుగా ప్ర‌తి ఏడాది మోదీని సోదరుడిగా భావించి రాఖీ క‌ట్టేవారు. కొవిడ్ కార‌ణంగా గ‌త మూడేళ్లు పోస్ట్‌లో పంపించ‌గా.. ఈ ఏడాది ఆగ‌స్టు 30 […]

Mohsin Shaikh | మ‌ళ్లీ మా సోద‌రుడే ప్ర‌ధాని.. మోదీకి 30 ఏళ్లుగా రాఖీ క‌డుతున్న పాక్ మ‌హిళ విశ్వాసం

Mohsin Shaikh | విధాత‌: కొవిడ్ వ‌ల్ల వ‌చ్చిన మూడేళ్ల విరామం త‌ర్వాత మోదీ (Narendra Modi) ని నేరుగా క‌లిసి రాఖీ క‌ట్ట‌నున్న‌ట్లు పాక్ మ‌హిళ (Pak Woman) మోషిన్ షేక్ వెల్ల‌డించారు. భార‌త్ యువ‌కుడిని పెళ్లి చేసుకుని దశాబ్దాల క్రిత‌మే ఆమె గుజ‌రాత్‌కు వ‌చ్చేసిన ఆమె.. సుమారు 30 ఏళ్లుగా ప్ర‌తి ఏడాది మోదీని సోదరుడిగా భావించి రాఖీ క‌ట్టేవారు.

కొవిడ్ కార‌ణంగా గ‌త మూడేళ్లు పోస్ట్‌లో పంపించ‌గా.. ఈ ఏడాది ఆగ‌స్టు 30 లేదా 31న ఆయ‌న‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి రాఖీ క‌డ‌తాన‌ని మోషిన్ తాజాగా పేర్కొన్నారు. ‘ఈ ఏడాది రాఖీని నేనే ప్ర‌త్యేకంగా త‌యారుచేశాను. ఎరుపు ధీర‌త్వానికి గుర్తు. అందుకే ఆ రంగు రాఖీ (Rakhi) ని మోదీకి క‌డ‌తా. ఆయ‌నకు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం బాగా ఇష్టం. అందుకే వ్య‌వ‌సాయం మీద రాసిన ఒక పుస్త‌కాన్న బ‌హుమ‌తిగా అంద‌జేస్తాను’ అని తెలిపారు.

‘ఒక‌ప్పుడు ఆయ‌న గుజ‌రాత్‌కు ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్రార్థించేదాన్ని. సీఎం అయ్యాక దేశానికి ప్ర‌ధాని కావాల‌ని కోరుకునేదానిని. ఇప్పుడు ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని ప్రార్థిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. ఆయ‌న ఎప్పుడూ ఆశాభావంతో ఉంటారని.. మీ కోరిక‌ల‌ను భ‌గ‌వంతుడే తీరుస్తాడ‌ని అనేవార‌ని మోషిన్ గుర్తుచేసుకున్నారు.

ఆయ‌నే ప్ర‌ధాని..

2024 ఎన్నిక‌ల్లో మోదీనే తిరిగి ప్ర‌ధానిగా ఎన్నిక‌వుతార‌ని మోషిన్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఆయ‌న అద్భుతంగా ప‌ని చేస్తున్నార‌ని.. విజ‌యం సాధిస్తార‌న‌డంలో ఎలాంటి అనుమానానికి తావులేద‌ని వెల్ల‌డించారు. సోద‌రుడు పోటీలో ఉన్నంత‌కాలం ఆయనే గెల‌వాల‌ని ప్రార్థిస్తాన‌ని పేర్కొన్నారు.