విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కుట్ర దారునిగా పేర్కొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బుధవారం సాయంత్రం 4 గంటల పది నిమిషాలు సమయంలో హనుమకొండ కోర్టు ఆవరణలోకి తీసుకొచ్చారు. ముందుగానే కోర్టు ఆవరణలో పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
పోలీసులు గట్టి భద్రత చేపట్టినప్పటికీ బండి సంజయ్ ని తీసుకువచ్చిన పోలీసు వాహనం ముందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి చెప్పులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లు విసిరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని అడ్డు తొలగించి సంజయ్ వాహనాన్ని లోపలికి తీసుకెళ్లారు.
న్యాయవాదులు తప్ప మిగతా ఎవరిని అక్కడ లేకుండా వెళ్లగొట్టారు. మడికొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి సరాసరి కోర్టుకు తీసుకొచ్చారు. లోపలికి ఎవరిని ప్రవేశించకుండా సంజయ్ ని తీసుకొచ్చిన మూడు పోలీసు వాహనాలను మాత్రమే అనుమతించారు. తదుపరి గేటు మూసేశారు.
బుధవారం సెలవు రోజు కావడంతో సుమారు 5 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఇంట్లో ఆయన ముందు హాజరు పరిచారు. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన అనంతరం సంజయ్ తరఫున లాయర్ల వాదన విని జడ్జి నిర్ణయం తీసుకుంటారు.
బండి సంజయ్ అరెస్టు కోర్టుకు హాజరు పరిచిన నేపథ్యంలో హనుమకొండ కోర్టు వద్ద టిఆర్ఎస్, బిజెపి నాయకులు పరస్పరం నిరసనలు కొనసాగించారు. దీంతో తీవ్ర ఉద్రిక పరిస్థితి నెలకొంది. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించారు. కోర్టు సమీపంలోకి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వచ్చిన సందర్భంలో మరింత ఉద్రిక్తత నెలకొంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాదు నుంచి కూడా బిజెపికి సంబంధించిన లీగల్ టీం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో వాదించే లాయర్లు ముందుగానే జడ్జి ఇంటి సమీపంలో ఉన్నారు.
ఏ1గా బండి సంజయ్
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేష్ రిమాండ్ రిపోర్టులో ఈటెల రాజేందర్ పీఏ నరేందర్ పేర్లు నమోదు చేశారు.
Breaking…
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేష్ రిమాండ్ రిపోర్టులో ఈటెల రాజేందర్ పీఏ నరేందర్ పేర్లు #sscpaperleak #bandisanjay #telangana #telugu #brs pic.twitter.com/q9EPL8PI2o
— vidhaathanews (@vidhaathanews) April 5, 2023