భూపాలపల్లిలో పొలిటికల్ హీట్! నిన్న రేవంత్ రెడ్డి నేడు కేటీఆర్ పర్యటన

కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ రేవంత్ రెడ్డి ఆరోపణలు విమర్శలు కేటీఆర్ ప్రతిస్పందనపై ఆసక్తి భూపాల్ పల్లి(BHUPALPALLY) జిల్లా కేంద్రమైన భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్‌లు నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. నిన్న బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పర్యటించారు. గురువారం రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటిస్తున్నారు. విధాత, వరంగల్ ప్రత్యేక […]

భూపాలపల్లిలో పొలిటికల్ హీట్! నిన్న రేవంత్ రెడ్డి నేడు కేటీఆర్ పర్యటన
  • కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ
  • రేవంత్ రెడ్డి ఆరోపణలు విమర్శలు
  • కేటీఆర్ ప్రతిస్పందనపై ఆసక్తి

భూపాల్ పల్లి(BHUPALPALLY) జిల్లా కేంద్రమైన భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్‌లు నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. నిన్న బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పర్యటించారు. గురువారం రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటిస్తున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ (Congress)చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాల్ పల్లి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర భూపాల్ పల్లి సెగ్మెంట్లోని రేగొండ, మొగుళ్లపల్లి మండలాల పరిధిలోని గ్రామాల మేరకు పరిమితమైంది.

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. అధికార పార్టీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి లక్ష్యంగా రేవంత్ రాజకీయ విమర్శలు, ఆరోపణలు, సవాల్లు చేశారు. నిన్న రేవంత్ సభకు జన సమీకరణ చేపట్టేందుకు ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కృషి కృషిచేసి, ఈ మేరకు విజయవంతం అయ్యారు.

కేటీఆర్ ప్రతి స్పందన పట్ల ఆసక్తి

రేవంత్(Revanth) చేసిన రాజకీయ విమర్శలు, ఆరోపణలు, సవాల్లతో అధికార పార్టీలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రేవంత్ రెడ్డి పర్యటనతో నియోజకవర్గంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ పెరిగింది.దీంతో రెండు పార్టీలు నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు పోటీ పడుతున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో విపక్ష పార్టీలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలపై ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే (reaction)ఆసక్తి నెలకొంది.

అభివృద్ధి పనులు ప్రారంభం

మంత్రి కేటీఆర్(KTR) భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభిస్తారు. మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. మంత్రి హామీల కోసం ఎమ్మెల్యే ఆశలు పెట్టుకోగా, విపక్ష విమర్శలపై ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే ఉత్సుకత స్థానికంగా నెలకొంది.

మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలో ఘనపూర్ మండల తహసిల్దార్ కార్యాలయ ప్రారంభం, బాలికల పాఠశాల, సింగరేణి ఉద్యోగుల కోసం నిర్మించిన వెయ్యి క్వార్టర్స్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, దివ్యాంగులకు కమ్యూనిటీ బిల్డింగ్ ప్రారంభించనున్నారు. నూతన గ్రంథాలయం, స్టేడియంలో పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

వేషాలపల్లి ‘డబుల్’ ఇండ్లకు మోక్షం

ఇదిలా ఉండగా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వేశాలపల్లి (veshalapally)లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఇటీవల ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమించుకునేందుకు మాజీ భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పేదలు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దంపతులను పేదలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని నిర్ణయించడంతో సంతోషం వ్యక్తం అవుతుంది.

భారీ సభకు బీఆర్ఎస్ (BRS)ఏర్పాట్లు

అధికార పార్టీ నేత, మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతిలు సభ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సభ విజయవంతనికి గండ్ర జ్యోతి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. 50 వేల మందితో భారీ సభ నిర్వహించాలని లక్ష్యంతో రమణారెడ్డి కృషి చేస్తున్నారు.