Ponguleti | కొద్ది రోజుల్లో పార్టీలో చేరే వివరాలు చెప్తా.. జూపల్లితో కలిసి పొంగులేటి
Ponguleti విధాత: తాను పార్టీలో చేరే వివరాలు, అతి కొద్ది రోజుల్లో చెపుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పీసీసీ అధ్య క్షులు రేవంత్ రెడ్డి బృందం తన ఇంటికి వచ్చి కలిసిన తరువాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సుధీర్ఘంగా ఆలోచించిన తరువాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తాను జూపల్లి కలిసి నాలుగు నెలలుగా […]

Ponguleti
విధాత: తాను పార్టీలో చేరే వివరాలు, అతి కొద్ది రోజుల్లో చెపుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పీసీసీ అధ్య క్షులు రేవంత్ రెడ్డి బృందం తన ఇంటికి వచ్చి కలిసిన తరువాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సుధీర్ఘంగా ఆలోచించిన తరువాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తాను జూపల్లి కలిసి నాలుగు నెలలుగా తెలంగాణలో అనేక ప్రాంతాలలో తిరిగామన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ బలరామ్ నాయక్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మల్లు రవి తదితర నేతలంతా వచ్చి తమను పార్టీలోకి ఆహ్వానించారన్నారు.