గ‌ర్భంతోనే.. రాత్రుల్లు వ‌ర్షంలో షూటింగ్‌ చేశా.. భ‌యాన‌క పరిస్థితులు చెప్పుకొచ్చిన పూర్ణ‌

  • By: sn    latest    Sep 30, 2023 12:38 PM IST
గ‌ర్భంతోనే.. రాత్రుల్లు వ‌ర్షంలో షూటింగ్‌ చేశా.. భ‌యాన‌క పరిస్థితులు చెప్పుకొచ్చిన పూర్ణ‌

న‌టి పూర్ణ‌.. గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించ‌డంతో ఆమెకి త‌ర్వాత చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే త‌ర్వాత చేసిన చిత్రాలు ఒక్కొక్క‌టిగా ఫ్లాప్ కావ‌డంతో పూర్ణ స‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తూ వ‌స్తుంది.



ఈ అమ్మ‌డు ఇటీవ‌ల అఖండ, దృశ్యం 2, ద‌సరా వంటి చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అల‌రిస్తూ వ‌స్తుంది. ఢీ సీజన్ 16 జడ్జిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే గత ఏడాది పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని రహస్య వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.


నిశ్చితార్థం గురించి చెప్పిన పూర్ణ‌.. పెళ్లి విష‌యం మాత్రం దాచి పెట్టింది.సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కింది. పెళ్లి గురించి మీడియా ఆమెని ప్ర‌శ్నించ‌గా, 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ చెప్పుకొచ్చింది.ఇక కొద్ది రోజుల‌కి పూర్ణ‌కి కొడుకు కూడా పుట్టేశాడు. బిడ్డ పుట్టాక పూర్ణ చాలా బ‌రువెక్కింది. ఆమెని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రీసెంట్‌గా పూర్ణ ద‌సరా షూటింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డ్డ విచిత్ర ప‌రిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.



`దసరా` సినిమాలో విలన్‌కి భార్య‌గా న‌టించింది పూర్ణ‌. షూటింగ్‌ సమయంలో తాను గర్బవతిగా ఉన్నట్టు చెప్పుకొచ్చిన పూర్ణ‌.. వర్షంలో షూటింగ్‌ చేయాల్సి వచ్చిందని, అది కూడా రాత్రి సమయంలో షూటింగ్‌ చేసినట్టు పేర్కొంది. అయితే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు తాను షూటింగ్ చేయ‌డం వ‌ల‌న చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్టు తెలియ‌జేసింది. త‌న‌పై నైట్ సీన్స్ ఎక్కువ‌గా షూటింగ్ జ‌రిపారు. చ‌ల్ల‌ని నీళ్లు వాడాల్సి రావ‌డం, చ‌లిలో సీన్స్ చేయడం వ‌ల‌న ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.

అయితే ఆయా సీన్స్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి షూటింగ్ చేసిన కూడా వాట‌న్నింటిని ఎడిటింగ్‌లో తీసేసారు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది పూర్ణ‌. త‌న ప‌డ్డ క‌ష్టం అంతా వేస్ట్ అయింద‌ని తెలియ‌జేసింది. సినిమాలో మరో సన్నివేశం కోసం రాత్రి పూట నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెత్తాల్సి రాగా, అప్పుడు వీధి కుక్కల అరుపులు విని ఎంతో భ‌య‌ప‌డ్డారు. అదృష్టవశాత్తు ఏవి తనని కరవలేదని చెప్పుకొచ్చింది. ఆయా సీన్లలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా షూట్‌ చేశాన‌ని పూర్ణ తెలియ‌జేసింది.