Poorna | టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా, జడ్జిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది పూర్ణ. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది పూర్ణ. ఆ సినిమా తర్వాత పూర్ణకి హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ వస్తున్నది. ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన పూర్ణ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. […]
Poorna | టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా, జడ్జిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది పూర్ణ. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది పూర్ణ. ఆ సినిమా తర్వాత పూర్ణకి హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ వస్తున్నది.
’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన పూర్ణ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరించింది. వెబ్ సిరీస్‌లలో కూడా అడపాదడపా సందడి చేస్తుంది. అయితే ఈ అమ్మడు గత ఏడాది జూన్‌లో సైలెంట్‌గా దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్ది రోజులకి తనకి మగ బిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చింది పూర్ణ.
అయితే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ పూర్ణ తాజాగా తన కుమారుడి పిక్స్ షేర్ చేసింది. ఓ పెళ్లి వేడుకకు పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ, కొడుకుతో హాజరైన పూర్ణ ఆ పిక్స్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
పూర్ణ చేతుల్లో ఆమె కొడుకు చందమామలా చాలా అందంగా కనిపిస్తున్నాడు. చాలా ముద్దుగా, బొద్దుగా ఉన్నాడని కొనియాడుతున్నారు. ఆ మధ్య పూర్ణ తన కొడుకు పేరును ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. హమ్దాన్ అసిఫాలీ అని పేరు పెట్టినట్టు తెలియజేసింది.
2022లో మే 31న షానిద్ తో పూర్ణకి నిశ్చితార్థం కాగా జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. పలు కారణాల వలన అత్యంత సన్నిహితులు మధ్య వారి వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత పూర్ణ భర్త ఇచ్చిన కానుకల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడని, పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడని చెప్పుకొచ్చారు. దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ కూడా నడిచింది.