Jayasudha
విధాత: మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. శనివారం ఆమె కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలవడంతో బీజేపీ చేరతారన్న ప్రచారానికి బలం చేకూరింది. వారం రోజుల్లో జయసుధ బీజేపీలో అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, శ్రీదేవి, సంజీవరావు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలు బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈనేతలు ఇప్పిటికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు మాజీ డీసీసీబీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జైపాల్‌రెడ్డిలు కూడీ బీజేపీలో చేరడానికి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది.
జయసుధ 2009లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె సికింద్రాబాద్ నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 2016 నుంచి 2019 టీడీపీలో, 2019 నుంచి 22 వరకు వైసీపీలో పని చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే తనకు ముషీరాబాద్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాగా బీజేపీ నాయకత్వం కూడా అంగీకరించినట్లు సమాచారం. జయసుధ బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.