చండూరులో మళ్లీ పోస్టర్ల కలకలం

విధాత: మునుగోడు ,చండూరులో గురువారం రాత్రి బిజెపికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బిజెపి లంబాడీలను ఎస్టీల జాబితా నుండి తొలగించే కుట్ర చేస్తుందని, మేము మీలాగా అమ్ముడుపోము ఖబర్దార్ అంటూ పోస్టర్లలో హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వ్యక్తులు పోస్టర్లు అంటిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని వివరాలపై ఆరా తీశారు. తాము హైదరాబాద్ నుండి వచ్చామని తమ పని పోస్టర్లు అంటించడం వరకే పరిమితం చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా బిజెపికి, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ […]

  • By: krs    latest    Oct 21, 2022 6:35 AM IST
చండూరులో మళ్లీ పోస్టర్ల కలకలం

విధాత: మునుగోడు ,చండూరులో గురువారం రాత్రి బిజెపికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బిజెపి లంబాడీలను ఎస్టీల జాబితా నుండి తొలగించే కుట్ర చేస్తుందని, మేము మీలాగా అమ్ముడుపోము ఖబర్దార్ అంటూ పోస్టర్లలో హెచ్చరిస్తూ ఉంది.

హైదరాబాద్ నుండి వచ్చిన వ్యక్తులు పోస్టర్లు అంటిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని వివరాలపై ఆరా తీశారు. తాము హైదరాబాద్ నుండి వచ్చామని తమ పని పోస్టర్లు అంటించడం వరకే పరిమితం చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా బిజెపికి, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వరసగా పోస్టర్లు వేలుస్తుడటం చర్చనీయాంశమైంది.