ప్రభాస్- గోపీచంద్‌ గొడవ పడింది.. ఆ హీరోయిన్ కోసమేనా?

విధాత: తెలుగు నాట దాదాపు 16 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది అనుష్క. ప్ర‌స్తుతం 48వ చిత్రంలో న‌టిస్తోన్న ఈమె త్వ‌ర‌లోనే హాఫ్ సెంచ‌రీ కొట్ట‌నుంది. ఈ 16 ఏళ్ల కాలంలో ఆమె పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఆమెపై ఏ వివాదం లేదు. ఇండస్ట్రీలో అనుష్క శెట్టి వివాదర‌హితురాలు. దర్శకనిర్మాతలు, తోటి నటీనటులకు ఆమె ఎంతో గౌరవం ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అనుష్కను ప్రేమిస్తారు.. అభిమానిస్తారు. అనుష్క అందర్నీ సమానంగా చూస్తూ చివరికి లైట్ బాయ్ నుంచి […]

  • By: krs    latest    Dec 24, 2022 5:51 AM IST
ప్రభాస్- గోపీచంద్‌ గొడవ పడింది.. ఆ హీరోయిన్ కోసమేనా?

విధాత: తెలుగు నాట దాదాపు 16 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది అనుష్క. ప్ర‌స్తుతం 48వ చిత్రంలో న‌టిస్తోన్న ఈమె త్వ‌ర‌లోనే హాఫ్ సెంచ‌రీ కొట్ట‌నుంది. ఈ 16 ఏళ్ల కాలంలో ఆమె పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఆమెపై ఏ వివాదం లేదు. ఇండస్ట్రీలో అనుష్క శెట్టి వివాదర‌హితురాలు. దర్శకనిర్మాతలు, తోటి నటీనటులకు ఆమె ఎంతో గౌరవం ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అనుష్కను ప్రేమిస్తారు.. అభిమానిస్తారు. అనుష్క అందర్నీ సమానంగా చూస్తూ చివరికి లైట్ బాయ్ నుంచి అందరితో ఎంతో సన్నిహితంగా ఉంటుంది. ఎవరిని ఏమీ అనదు. చాలా మృదుస్వభావి. అందుకే అనుష్క అంటే పరిశ్రమలో ప్రత్యేక గౌరవం ఉంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, గొప్ప మనసు కలిగిన మనిషి అనుష్క. అందుకే ఆమెతో ఓ చిత్రంలో ప‌నిచేసిన వారు మ‌ర‌లా ఆమెతో ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపుతారు. అలాంటి సౌమ్యమైన గుణం కలిగిన అనుష్క మీద పలుమార్లు ఎఫైర్స్ అంటూ రూమర్స్ వచ్చాయి. హీరోలు, సాంకేతిక నిపుణులతో కూడా మీడియా ఆమెకు లింకు పెట్టేసింది. కెమెరామెన్ సెంథిల్ కుమార్- అనుష్క ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వివాహం చేసుకుంటారని వార్తలు వ‌చ్చాయి. అనంతరం గోపీచంద్‌తో అనుష్కకు ఎఫైర్ ఉంద‌ని వారిద్ద‌రు ప్రేమాయ‌ణం నడుపుతున్నట్టు వార్తలు వచ్చాయి.

ఒక దశలో వీరిద్దరూ కలిసి వరుసగా చిత్రాలు చేశారు. మంచి ఒడ్డు పొడుగు ఉన్న వీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండేవాళ్ళు. గోపి అనుష్కలు కలిసి నటించిన మొదటి చిత్రం ‘లక్ష్యం’. ఈ మూవీ సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే గోపీచంద్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్టుగా చెప్పాలి. ఇందులో జగపతిబాబు కూడా కీల‌క‌పాత్ర‌ను పోషించాడు. అనంతరం ‘శౌర్యం’ చిత్రంతో వీరు మరోసారి జత కట్టారు. శౌర్యం చిత్రం సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ జంటపై సంద‌ట్లో స‌డేమియాగా ప‌లు రూమ‌ర్లు వ‌చ్చాయి. వీరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. అదే టైంలో అనుష్కతో ప్రభాస్ కూడా జత కట్టారు.

గత ఐదు ఆరేళ్లుగా టాలీవుడ్‌లో వీరిపై వచ్చే వార్తలే హాట్‌టాపిక్‌. వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. బిల్లా, మిర్చి, బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి- ది కంక్లూజన్ వంటి చిత్రాలు వచ్చాయి. దాంతో ఈ జంటపై ఎఫైర్, పెళ్లి రూమర్స్ వినిపించాయి. వీరిది కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా ఉండే జంట. వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది భావించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కానివారు ఇత‌ర హీరోల అభిమానులు కూడా ఈ జంట బాగుంటుందని కితాబుని ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ఆహాలో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే 2 చేస్తున్నాడు. ప్రభాస్, గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్లో బాలయ్య మాట్లాడుతూ 2008- 09 ప్రాంతంలో ఒక హీరోయిన్ కోసం ఇద్దరూ కొట్టుకున్నారంటగా అని అడిగాడు. బాలయ్య చెప్పిన కాలాన్ని బట్టి చూస్తే ఆ సమయంలో ప్రభాస్- గోపీచంద్‌లతో పనిచేసిన కామన్ హీరోయిన్ అనుష్క మాత్రమే. 2007లో లక్ష్యం, 2008లో శౌర్యం విడుదలయ్యాయి. 2009లో బిల్లా వచ్చింది. అనుష్క కోసం పోటీ పడ్డారని తెలుస్తోంది. బాలయ్య ఇక్కడ పక్కా సమాచారంతోనే ఇద్దరినీ ఇరికించాడని అంటున్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది. మరి ఈ హీరోలు బాల‌య్య మాట‌ల‌కు ఊ… అంటారా లేదా ఊ..ఊ అంటారా? అనేది వేచిచూడాల్సి వుంది.