Prabhas | కృతితో గొప్ప‌ అనుబంధాన్ని పంచుకున్నా..

Prabhas విధాత‌: ఆదిపురుష్‌లో న‌టించిన హీరో ప్ర‌భాస్‌, హీరోయిన్ కృతిస‌న‌న్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్‌పై కొన్నాళ్లుగా బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ రూమ‌ర్స్ షికార్లు చేస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌లో రాఘవ్ (రాముడు)గా ప్రభాస్, జానకి (సీత) పాత్రలో కృతి సనన్ నటించారు. గత ఏడాది నుంచి వీరిద్దరు స్టార్స్‌పై డేటింగ్ వదంతులు వచ్చాయి. అయితే వాటిని ప్రభాస్, కృతి ఇద్దరూ ఖండించారు. తాజాగా తిరుపతిలో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా విడుదలకు […]

  • Publish Date - June 20, 2023 / 09:37 AM IST

Prabhas

విధాత‌: ఆదిపురుష్‌లో న‌టించిన హీరో ప్ర‌భాస్‌, హీరోయిన్ కృతిస‌న‌న్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్‌పై కొన్నాళ్లుగా బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ రూమ‌ర్స్ షికార్లు చేస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌లో రాఘవ్ (రాముడు)గా ప్రభాస్, జానకి (సీత) పాత్రలో కృతి సనన్ నటించారు. గత ఏడాది నుంచి వీరిద్దరు స్టార్స్‌పై డేటింగ్ వదంతులు వచ్చాయి. అయితే వాటిని ప్రభాస్, కృతి ఇద్దరూ ఖండించారు.

తాజాగా తిరుపతిలో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా విడుదలకు ముందు వదంతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే, ఈ సారి మాత్రం హీరో హీరోయిన్లు ప‌ర‌స్ప‌రం అభినంద‌నలు కురిపించుకున్నారు. గ‌త వారం ఓ మీడియాకు కృతి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ‘ప్ర‌భాస్ గొప్ప‌న‌టుడు. అంద‌రితో గౌరవంగా ఉంటాడు. అత‌డివి ఎక్స్‌ప్రెస్సివ్ ఐస్‌.. స‌దా ప్ర‌శాంతమైన ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉంటాడు’ అని కీర్తించింది.

ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రభాస్ కూడా కృతి న‌ట‌న‌ను మెచ్చుకున్నారు. కృతితో గొప్ప‌ అనుబంధాన్ని పంచుకున్న‌ట్టు చెప్పాడు. వేర్వేరు చిత్ర పరిశ్రమల నుంచి చాలా తేడాతో వచ్చినప్పటికీ ఆదిపురుష్ సెట్స్‌లో తాము ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదని అన్నారు ప్ర‌భాస్‌.

“సినిమా సార్వ‌జ‌నీన భాష. కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. అందుకే, నేడు విభిన్న పరిశ్రమలు, వర్కింగ్ స్టైల్స్ పట్టింపు లేదు. మేమిద్దరం భారతీయ సినిమాకు చెందినవాళ్ళం. కళ మమ్మల్ని కలిపే కామన్ వేదిక‌. కృతి చాలా బ్యాలెన్స్‌డ్‌. ప్రొఫెషనల్ యాక్టర్. మేము గొప్ప అనుబంధాన్ని పంచుకున్నాము’ అని చెప్పారు ప్ర‌భాస్‌.

Latest News