లీకైన పిక్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్.. ఇక మారుతి దున్నుడే!
విధాత: మొదట్లో కొన్ని విజయవంతమైన చిత్రాలను తీసినప్పటికీ మారుతిపై బూతు చిత్రాలు తీస్తాడని పేరు వచ్చింది. అవి కమర్షియల్‌గా హిట్టైనా సరే.. ఆ బ్రాండ్ ఆయనపై అలాగే ఉండిపోయింది. కానీ ‘ప్రేమకథా చిత్రమ్’ మూవీ ఆయనకున్న ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’తో తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి హిట్స్‌ని ఇచ్చాడు. కానీ ఆయన వెంకటేష్‌తో చేసిన బాబు బంగారం, నాగచైతన్యతో తీసిన శైలజా రెడ్డి […]

విధాత: మొదట్లో కొన్ని విజయవంతమైన చిత్రాలను తీసినప్పటికీ మారుతిపై బూతు చిత్రాలు తీస్తాడని పేరు వచ్చింది. అవి కమర్షియల్‌గా హిట్టైనా సరే.. ఆ బ్రాండ్ ఆయనపై అలాగే ఉండిపోయింది. కానీ ‘ప్రేమకథా చిత్రమ్’ మూవీ ఆయనకున్న ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’తో తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి హిట్స్‌ని ఇచ్చాడు.
కానీ ఆయన వెంకటేష్‌తో చేసిన బాబు బంగారం, నాగచైతన్యతో తీసిన శైలజా రెడ్డి అల్లుడు, గోపీచంద్ తో చేసిన పక్కా కమర్షియల్ చిత్రాలు సరిగా ఆడలేదు. అలాంటి మారుతి ప్రస్తుతం ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రభాస్‌కు బాహుబలి-1, బాహుబలి 2ల తర్వాత సరైన హిట్టు లేదు. సాహో, రాధేశ్యామ్‌లు నిరాశపరిచాయి.
ఇక ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయిన సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటివి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇలాంటి సమయంలో కాస్త వేగంగా సినిమాలను తీసే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ విభిన్న ప్రయత్నం చేస్తున్నాడు. హర్రర్ కామెడీ చిత్రంగా ఓ మూవీలో నటిస్తున్నాడు. మరి ఇది పాన్ ఇండియా లెవల్ చిత్రమా కాదా అనేది అయితే తెలీదు.
తాజాగా ఈ చిత్రం నుండి ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. పక్కా కమర్షియల్ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని బాగా ట్రోల్ చేస్తుండటంతో ఈ మూవీని మారుతీ అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. సినిమా పూర్తి అయిన తర్వాతే ఆయన అప్డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నాడు. కాగా ఈ లీకైన ప్రభాస్ లుక్ ప్రభాస్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
నిన్నటి దాకా ట్రోల్ చేసిన అభిమానులు ఇప్పుడు తమ హీరోని కొత్తగా చూపిస్తున్నారు అంటూ ఆనందపడిపోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. దాంతో ఈ ముగ్గురు హీరోయిన్లు ఈ చిత్రంతో తమ జాతకం మారిపోతుందని నమ్ముతున్నారు.
మరి మారుతి ప్రభాస్‌కి సరైన సక్సెస్ ఇస్తాడా? ప్రభాస్ నమ్మకాన్ని నిలబెడతాడా? ప్రభాస్ రేంజ్ స్టార్ హీరోని మారుతి హ్యాండిల్ చేయగలడా? అనేవి ప్రశ్నార్థకాలు. ఎందుకంటే ప్రభాస్ మూవీ గాని హిట్ అయితే మారుతితో చేయడానికి అల్లు అర్జున్ నుండి చిరంజీవి వరకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఈ చిత్రం మారుతి కెరీర్‌కు అగ్నిపరిక్ష అని చెప్పాలి! చూద్దాం ఏం జరగబోతోందో?