పెళ్లికూతురు రెడీగా ఉంది.. ప్రభాస్
విధాత: ఎంతోకాలంగా టాలీవుడ్‌లో అందరి నోటా వినిపిస్తున్న మాట ప్రభాస్ పెళ్లి. ఆయన పెళ్లి గురించి వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరి ఏ ఇతర హీరోకు ఈ మధ్యకాలంలో రాలేదు. అసలు ఇంతవరకు రాలేదంటే కూడా పెద్ద అతిశయోక్తి కాదేమో. నాడు పెద్దగా సామాజిక మాధ్యమాలు, మీడియాలు లేవు. కానీ ప్రభాస్ పరిస్థితి అది కాదు. ఆయన ఏ హీరోయిన్‌తో నటించినా.. ఎవరితో క్లోజ్‌గా మూవ్ అయినా ఆయనకు ఆమెతో పెళ్లి జరిపించేవారు. ఆయా హీరోయిన్లు నెత్తి […]

విధాత: ఎంతోకాలంగా టాలీవుడ్‌లో అందరి నోటా వినిపిస్తున్న మాట ప్రభాస్ పెళ్లి. ఆయన పెళ్లి గురించి వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరి ఏ ఇతర హీరోకు ఈ మధ్యకాలంలో రాలేదు. అసలు ఇంతవరకు రాలేదంటే కూడా పెద్ద అతిశయోక్తి కాదేమో.
నాడు పెద్దగా సామాజిక మాధ్యమాలు, మీడియాలు లేవు. కానీ ప్రభాస్ పరిస్థితి అది కాదు. ఆయన ఏ హీరోయిన్‌తో నటించినా.. ఎవరితో క్లోజ్‌గా మూవ్ అయినా ఆయనకు ఆమెతో పెళ్లి జరిపించేవారు. ఆయా హీరోయిన్లు నెత్తి నోరు బాదుకున్నా వినేవారు కాదు.
ఇది నిజం కాదు అని ఖండించినా.. కూడా పదే పదే అదే వార్తను వండి వార్చేవారు. ఇంకా చివరికి ఆయా హీరోయిన్లు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామన్న కూడా భయపడకుండా… వాటిని పట్టించుకోకుండా దానికంటే ప్రభాస్‌కు, ఆ హీరోయిన్‌కు లింకు పెట్టడమే ధ్యేయంగా, ధైర్యంగా వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే వారు.
పాపం పెద్దాయన, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మానసిక క్షోభ ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఇప్పుడు స్వర్గస్తులయ్యారు. ఇంకా ప్రభాస్ కూడా ముదురు బెండకాయలా మారుతుండడంతో అందరూ దిగులు పడ్డారు. ఇంతవయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు అంటూ.. బాధని వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం దాన్ని లైట్‌గా తీసుకుంటూ కొట్టి పారేస్తున్నాడు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ తాజాగా తన పెళ్లి విషయంలో నోరు విప్పాడని తెలుస్తోంది.
వినాయకుడి పెళ్లికి విఘ్నాలలాగా వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ తన పెళ్లిపై నోరు విప్పింది నిజమైతే.. చాలా మంది చేతలకు పని తప్పుతుంది. అంటే ఆయన పెళ్లి వార్తలు వండి వార్చే కష్టం ఇక వారికి ఉండదు. సోషల్ మీడియాలో తరచుగా ఇదే అంశంపై చర్చలు జరిగాయి.
యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ రైటర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి చేసేసారు. ఎప్పటినుండో ప్రభాస్ తన బాహుబలి పార్ట్నర్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి నిజజీవితంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. బహుశా అది కూడా ఓ శాపం అయి ఉంటుంది. ఆ వార్తలను చాలామంది నిజమని నమ్మే వారు కూడా. ఎందుకంటే వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కనుక.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఆయన భార్య సీతగా వన్ నేనొక్కడినే ఫేమ్ కృతిసనన్ నటిస్తోంది. దాంతో ఇప్పుడు పలువురు ప్రభాస్‌కు కృతి సనన్‌కు లింకు పెట్టేశారు. సినిమా తెరపై సీతారాములుగా కనిపించనున్నారు. మరి వారిని జీవితంలో కూడా జంటను చేశారు. వీళ్ళిద్దరి నిశ్చితార్థం త్వరలో జరగబోతుందని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం ఈ వార్త వైరల్‌గా మారిపోయింది. అదేంటి అనుష్కతో డేటింగ్, పెళ్లి మాత్రం కృతిసనన్‌తోనా అని మరికొందరు మరిన్ని వంటకాలు రెడీ అన్నారు. ప్రభాస్‌ని ప్రేమద్రోహిగా చిత్రీకరించడం ప్రారంభం అయ్యే సమయానికి.. ఈ వార్తలపై రియాక్ట్ అయిన కృతిసనన్.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసేదాకా పరిస్థితి వచ్చింది.
తాజాగా ఆహా ఓటీటీలో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఅన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే2లో ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ షో కి సంబంధించి షూటింగ్ జస్ట్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి. ఎడిటింగ్ వర్క్ పూర్తి అయితే ఈ శుక్రవారం నుండి ఈ ఎపిసోడ్ ఆహా మీడియాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు అనుష్కతో డేటింగ్ చేస్తున్నావు అంటగా… పెళ్లి ఎప్పుడు మరి? అని ప్రభాస్‌ను అడుగగా. అప్పుడు ప్రభాస్ అదంతా ఫేక్ రూమర్స్ సార్.. అనుష్క నాకు మంచి స్నేహితురాలు. నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది.
మీకు ఈ షో అయినాక ఆమె ఎవరో చెప్తాను లెండి.. అంటాడట. మొత్తానికి ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని ఓ క్లారిటీ వచ్చింది. మరి ప్రభాస్‌ని పెళ్లాడబోతున్న ఆ లక్కీ గర్ల్ ఎవరో చూడాలి. ఆ విషయం కూడా ప్రభాస్ ఎంత వీలైతే అంత తొందరగా అసలు నిజాన్ని బయట పెట్టాలి.
లేదంటే అమాయకపు అమ్మాయిలను కూడా ప్రభాస్‌తో జోడి కట్టించి మన ఫేక్ రూమ్ తాళింపుగాళ్లు బాగా వంటకాలు చేసి, మసాలాలు దట్టించి మరి ప్రచారంలోకి తెచ్చి ఆయా అమ్మాయిల కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందుకే కొన్ని చెప్పాలి….కొన్నింటిని దాచాలి. అవి ఎలాంటివో తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది మరి… ప్రభాస్ వింటాడో లేదో..?