కేసీఆర్‌కు సినీనటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శ
తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమవారం ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు

విధాత: తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమవారం ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు. హైదరాబాద్ లోని యశోద దవాఖానాకు చేరుకున్న ఆయన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.