విషమంగా ప్రీతి ఆరోగ్యం.. కాలేజీలోకి నో ఎంట్రీ

విచారణ చేపట్టిన ప్రొఫెసర్ల కమిటీ ఎంజీఎంలో చికిత్స చేసిన డాక్టర్ల నివేదిక అనుమతి లేకుండానే కేఎంసీలోకి నో ఎంట్రీ మెడికో ప్రీతి సంఘటన నేపథ్యంలో పోలీసు బందోబస్తు పేషెంట్ల,అటెండెంట్ల అవస్థలు విద్యార్థి సంఘాల నిరసన, అరెస్ట్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన సంక్లిష్టంగా మారింది. సున్నితమైన విషయం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కమిటీ నివేదిక ప్రాధాన్యత సంతరించుకోవడంతో అన్ని కోణాలలో […]

  • By: Somu    latest    Feb 23, 2023 11:22 AM IST
విషమంగా ప్రీతి ఆరోగ్యం.. కాలేజీలోకి నో ఎంట్రీ
  • విచారణ చేపట్టిన ప్రొఫెసర్ల కమిటీ
  • ఎంజీఎంలో చికిత్స చేసిన డాక్టర్ల నివేదిక
  • అనుమతి లేకుండానే కేఎంసీలోకి నో ఎంట్రీ
  • మెడికో ప్రీతి సంఘటన నేపథ్యంలో పోలీసు బందోబస్తు
  • పేషెంట్ల,అటెండెంట్ల అవస్థలు
  • విద్యార్థి సంఘాల నిరసన, అరెస్ట్

పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన సంక్లిష్టంగా మారింది. సున్నితమైన విషయం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కమిటీ నివేదిక ప్రాధాన్యత సంతరించుకోవడంతో అన్ని కోణాలలో సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రీతికి ఎంజీఎంలో చికిత్స చేసిన వైద్యులు ఒక నివేదిక అందజేసినట్లు సమాచారం. మెడికో ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజీలోకి నో ఎంట్రీ విధానం పాటిస్తున్నారు. ప్రధాన గేటు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేఎంసీలోకి ఎవరు వెళ్ళాలంటే పోలీసు తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు విద్యార్థి,యువజన సంఘాల నిరసన గురువారం కూడా కొనసాగింది.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పీజీ మెడికో ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం సంఘటన పై సంబందిత వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ సున్నితమైన సంఘటనపై జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సంఘటనపై విచారించేందుకు ఏర్పాటుచేసిన నలుగురు ప్రొఫెసర్ల కమిటీ రంగంలోకి దిగింది.

టనకు సంబంధించిన పూర్వపరాలు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిసింది. నలుగురు ప్రొఫెసర్ల బృందంతో ఏర్పాటుచేసిన విచారణ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను మెడికల్ విద్యావిభాగానికి అందజేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

చికిత్స చేసిన వైద్య బృందం నివేదిక

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతికి ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స చేసిన వైద్య బృందం తమ నివేదికను సంబంధిత సూపరింటెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కు అందజేసినట్లు తెలిసింది. ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో పాటు ఆమె ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదికలో డాక్టర్లు పొందుపరిచినట్లు సమాచారం.

కేఎంసి లోకి నో ఎంట్రీ

పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య సంఘటన కారణంగా కేఎంసీ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ లోపలికి పోవాలన్న అదే ఆవరణలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి (Hospital)వెళ్లాలన్న ఉన్న అదే గేటు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్పిటల్‌కి వెళ్లే రోగులు రోగుల వద్ద ఉండే అటెండెంట్లు అవస్థల పాలయ్యారు.

ఎవరు లోనికి వెళ్లాలన్నా తనిఖీలు (checking)చేసిన అనంతరం సంబంధిత ఆధారాలు ఐడి కార్డు చూపెడితేనే లోపలికి పంపించారు. ఇదిలా ఉండగా మీడియాని కూడా లోనికి అనుమతించలేదు. ఇక మెడికల్ కాలేజీ విద్యార్థులందరినీ బయటికి వెళ్లకుండా నిరోధించినట్లు సమాచారం.

కొనసాగిన విద్యార్థుల (students)నిరసన

ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన పై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కేఎంసి ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. రాత్రి ఎస్ఎఫ్ఐ (Sfi)విద్యార్థుల నిరసన వ్యక్తం చేసి ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. ఉదయం ఏబీవీపీ(Abvp)ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి హెడ్ క్వార్టర్ కు తరలించారు.

ప్రీతికి న్యాయం చేయాలని వరంగల్ తూర్పు బిజెపి నాయకుడు కుసుమ సతీష్ బాబు డిమాండ్ చేశారు గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంజీఎం గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటనకు కొందరు అవకాశవాద వైఖరితో మతపరమైన రంగు పులిమే ప్రయత్నాలను పలువురు వ్యతిరేకించారు.

ప్రీతీ హెల్త్ బులిటెన్

మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించిన పీజీ మెడికో ప్రీతి హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు.


మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కండిషన్లో నిమ్స్ కు షిఫ్ట్ చేసినందున తగిన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్మోపై ప్రీతికి చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్య బృందం ఆ బులిటెన్‌లో వెల్లడించింది.