హైదరాబాద్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌లు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు,అధికారులు ఘన స్వాగతం పలికారు

  • By: Somu    latest    Mar 15, 2024 12:44 PM IST
హైదరాబాద్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి
  • స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌


విధాత, హైదరాబాద్‌ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌లు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు,అధికారులు ఘన స్వాగతం పలికారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్- 2024’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చారు.


ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌ పూర్తయ్యాక ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. అలాగే, రేపు ఉప రాష్ట్రపతి జగదీశ్‌ ధన్కడ్ విశిష్ట అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల వరుస సమావేశాలు కొనసాగుతాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్ ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు ఈ ఆథ్యాత్మిక మహోత్సవం కొనసాగనుంది.