విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవచ్చని మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఉపయోగం కోసం క్రితం సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, అదే రీతిలో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని ఏముందన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరగవచ్చని, అప్పటిదాకా సీఎం కేసీఆర్ కు అవకాశం ఉంటుందో లేదోనని, అప్పుడు ఆరు నెలలు లేక ఏడాది తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేకపోలేదు అన్నారు.
ఏపీలో వైయస్సార్ పార్టీ ముందస్తుకు పోతుందని అనుకోనని, అదే జరిగితే ఏపీలో కూడా రాష్ట్రపతి పాలన రావచ్చన్నారు. బిజెపికి పవన్ కళ్యాణ్ కి మంచి రిలేషన్, పొత్తు ఉందన్నారు. టీడీపీకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని వైకాపా వారు పదే పదే అంటుడటంతో వారిద్దరూ కలిస్తే వైకాపా ఓడిపోతుందని భావించి నిజంగానే టిడిపి పవన్ లు కలిసేలా ఆలోచన రేకెత్తిస్తున్నారు అన్నారు. ప్రస్తుతానికి వైకాపాకు ఎదురుగాలి మొదలైందని ఈ సమయంలో వారు ముందస్తుకు వెళ్ళబోరన్నారు.