Nalgonda: BRSకు పాకిన PRTU ముసలం! సుంకరి దీక్షలో గుత్తా, కంచర్ల వర్గాల రచ్చ!

BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మ‌ధ్య చిచ్చు విధాత: PRTU జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌ను ఆ సంఘం నుంచి బహిష్కరించిన వివాద సెగలు అటు ఇటు తిరిగి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య చిచ్చురేపాయి. తన సస్పెన్షన్ ను నిరసిస్తూ సేవ్ పి ఆర్ టి యు పేరుతో ఆ సంఘం జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం భిక్షంగౌడ్ నిరసన దీక్ష నిర్వహించారు. అయితే ఆయనను తమ సంఘం బహిష్కరించినందున తమ కార్యాలయం ముందు […]

Nalgonda: BRSకు పాకిన PRTU ముసలం! సుంకరి దీక్షలో గుత్తా, కంచర్ల వర్గాల రచ్చ!
  • BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మ‌ధ్య చిచ్చు

విధాత: PRTU జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌ను ఆ సంఘం నుంచి బహిష్కరించిన వివాద సెగలు అటు ఇటు తిరిగి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య చిచ్చురేపాయి. తన సస్పెన్షన్ ను నిరసిస్తూ సేవ్ పి ఆర్ టి యు పేరుతో ఆ సంఘం జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం భిక్షంగౌడ్ నిరసన దీక్ష నిర్వహించారు.

అయితే ఆయనను తమ సంఘం బహిష్కరించినందున తమ కార్యాలయం ముందు దీక్షకు అనుమతి ఇవ్వవద్దంటూ జిల్లా ఎస్పీకి రాష్ట్ర పి ఆర్ టి యు నాయకులు అప్పీల్ చేశారు. దీనితో భిక్షంగౌడ్ తన దీక్షకు అనుమతి సాధించే విషయంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని సంప్రదించిన నేపథ్యంలో దీక్షకు అనుమతి లభించింది.

ఇదే సమయంలో భిక్షంగౌడ్ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వరాదంటూ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ రెడ్డితో పాటు ఆయన అభ్యర్థనతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన వర్గీయులైన పిఆర్ టియు సంఘ నాయకులు ప్రయత్నించారని భిక్షంగౌడ్ వర్గీయులలో ప్రచారం సాగింది.

ఇదే విషయాన్ని భిక్షంగౌడ్ దీక్షకు హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బాహటంగానే తన ప్రసంగంలో ప్రస్తావించారు. సుఖేందర్ రెడ్డి వర్గీయులు, పూల రవీందర్ వర్గీయులు భిక్షంగౌడ్ దీక్షకు పోలీసులు అనుమతించొద్దని ఉపాధ్యాయులు, ఎవరు హాజరు కావద్దని ఫోన్ల ద్వారా ఒత్తిడి చేశారని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ మాటలు నిజమైనవని ఎవరైనా రికార్డ్ చేసుకోవచ్చన్నారు.


భిక్షంగౌడ్ కు తనతో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మద్దతు ఉందన్నారు. భిక్షంగౌడ్ వ్యక్తి కాదని, ఉపాధ్యాయ శక్తి అని, ఎవరో అడ్డుకుంటే ఆగిపోయే వ్యక్తి కాదంటూ భూపాల్ రెడ్డి పరోక్షంగా సుఖేందర్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. భిక్షంగౌడ్ నిరసన దీక్షకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కరరావు, గాదరి కిషోర్‌ సైతం తమ సంఘీభావం తెలిపారు.

అయితే పి ఆర్ టి యు నేత భిక్షంగౌడ్ బహిష్కరణ తీరు ఆ సంఘం అంతర్గత సంక్షోభానికి దారి తీయగా ఆ వివాదం జిల్లా బిఆర్ఎస్ రాజకీయాల్లో చిచ్చు రేపడమే ఇప్పుడు జిల్లా రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తి కర అంశంగా మారింది.

ముఖ్యంగా భిక్షం గౌడ్ నిరసన దీక్ష సెగలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లకు మధ్య చిచ్చు రేపగా ఈ వివాదం మునుముందు బిఆర్ఎస్ రాజకీయాలను ఎటు తీసుకెళ్తాయోనన్న ఆసక్తికర చర్చలు బిఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పి ఆర్ టి యు బహిష్కృత నేత సుంకరి భిక్షంగౌడ్, ఆయన అన్న బిఆర్ఎస్ నాయకులు చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ అందరిదీ ఒకే స్వగ్రామం ఉరుమడ్ల కావడం గమనార్హం.

జిల్లా బిఆర్ఎస్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వారి మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు బిఆర్ఎస్ రాజకీయాలను తరుచూ రచ్చకెక్కిస్తుండటం పార్టీ క్యాడర్లో చర్చనీయాంశమవుతుంది.