PRTU బలగం మా వెంటే: నూతన అధ్యక్షుడు DVS. ఫణికుమార్ స్పష్టీకరణ
బదిలీలు, పదోన్నతులపై స్టే ఎత్తివేతకు చర్యలు విధాత: PRTU ఉపాధ్యాయ సంఘం సభ్యులంతా సంఘంతోనే ఉన్నారని ఎవరు కూడా సంఘం వదిలి వెళ్లడం లేదని నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడు DVS. ఫణికుమార్ స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడిగా నియమతులైన ఫణి కుమార్‌ను నిత్యం ఒక్కో మండలం PRTU ఉపాధ్యాయులు కలిసి తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. గుర్రంపోడు, నల్గొండ మండలాల శాఖల ఉపాధ్యాయులు 150 మంది PRTU భవన్ లో ఆయనను కలిసి ఘనంగా సన్మానించి సంఘీభావం […]

బదిలీలు, పదోన్నతులపై స్టే ఎత్తివేతకు చర్యలు
విధాత: PRTU ఉపాధ్యాయ సంఘం సభ్యులంతా సంఘంతోనే ఉన్నారని ఎవరు కూడా సంఘం వదిలి వెళ్లడం లేదని నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడు DVS. ఫణికుమార్ స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడిగా నియమతులైన ఫణి కుమార్‌ను నిత్యం ఒక్కో మండలం PRTU ఉపాధ్యాయులు కలిసి తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. గుర్రంపోడు, నల్గొండ మండలాల శాఖల ఉపాధ్యాయులు 150 మంది PRTU భవన్ లో ఆయనను కలిసి ఘనంగా సన్మానించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పని చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆది నుంచి అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా పిఆర్టియు కొనసాగుతుందని, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయ డిమాండ్లను సాధించిన ఘనత చరిత్ర రాష్ట్రంలో పిఆర్టియుకే సొంతమన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై ఈనెల 11 వరకు హైకోర్టులో స్టే ఉందని, ప్రభుత్వంతో చర్చించి స్టే ఎత్తివేతకు PRTU రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సాధించే దిశగా పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ఏడాది కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సమస్యల సాధనలో PRTU ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి డిమాండ్లను సాధిస్తుందన్నారు. అతిపెద్ద సంఘంగా ఉన్న పిఆర్టియు తమ సంఘ సభ్యుల సమస్యల విషయంలో రాజీ పడబోదన్నారు.
ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల అన్నెపురెడ్డి, నాంపల్లి శ్రవణ్ కుమార్ లు, నల్లగొండ మండల అసోసియేట్ అధ్యక్షులు బి.సైదులురావు, నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి, తరాల పరమేశ్ యాదవ్, కొసనం కరుణాకర్ రెడ్డి, బోయినపల్లి రమేష్ బాబు, మేడిగ రఘు, యస్.రామకృష్ణారెడ్డి, శ్రీరాంరెడ్డి, వోలి సమీర్ కుమార్, చిలుముల బాల్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి,
నాంపల్లి శ్రీనివాసులు, మురళీమోహన్ రెడ్డి, తిరందాసు సత్తయ్య, ఏమిరెడ్డి సైదిరెడ్డి, కసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనాథ్, వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి, గోపాల్, దేవేందర్ రెడ్డి, మధు, వలిశెట్టి సత్యం, అద్దంకి యాదగిరి, పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, వెంకటరమణారెడ్డి, యాదగిరి, రఘుపతి రెడ్డి, సుధాకర్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.