MEDAK: ఖదీర్ ఖాన్ కేసును CBIకి అప్పగిస్తాం: NMC
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి రూ.50 లక్షలు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యులు సయ్యద్ షా హే జాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మైనార్టీ కమిషన్ సభ్యులు.. విధాత, మెదక్ బ్యూరో: ఖదీర్ ఖాన్ మృతి కేసును అవసరమైతే సిబిఐకి అప్పగిస్తామని జాతీయ మైనార్టీ కమిషన్ (NMC)మెంబర్ సయ్యద్ షాహెజాద్ తెలిపారు. ముస్లిం కావడం వల్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. కమిషన్‌కు మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏమాత్రం […]

- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
- రూ.50 లక్షలు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
- జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యులు సయ్యద్ షా హే జాద్
- కుటుంబ సభ్యులను పరామర్శించిన మైనార్టీ కమిషన్ సభ్యులు..
విధాత, మెదక్ బ్యూరో: ఖదీర్ ఖాన్ మృతి కేసును అవసరమైతే సిబిఐకి అప్పగిస్తామని జాతీయ మైనార్టీ కమిషన్ (NMC)మెంబర్ సయ్యద్ షాహెజాద్ తెలిపారు. ముస్లిం కావడం వల్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. కమిషన్‌కు మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏమాత్రం సహకరించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజ్యాంగం కల్పించిన కమిషన్‌కు సహకరించక పోతే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో పోలీసు దెబ్బలు కొట్టగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఖదీర్ ఖాన్ కుటుంబ సభ్యులను సోమవారం మెదక్‌లో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మృతికి కారణమైన పోలీసులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఖదీర్ ఖాన్ కేసు డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఎస్పీకి ముందే చెప్పినా తీసుకురాలేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన కమిషన్ అడిగితే డాక్యుమెంట్ ఎందుకు చూపించరని ప్రశ్నించారు.
ఎఫ్ఐఆర్ చూపరు, సెక్షన్ ఎంటో చెప్పరని అసహనం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద డబుల్ బెడ్ రూం పట్టా ఇస్తామని తర్వాత కలెక్టర్ మాట మార్చారాని అసంతృప్తి తెలిపారు. హియరింగ్‌కి ఢిల్లీకి పిలుస్తామన్నారు.
ఖదీర్ ఖాన్ మృతిపై కమిషన్ వేస్తామని, అవసమైతే కేసు సిబిఐకి ఇస్తామని వివరించారు. రాష్ట్ర హోంమంత్రి తక్షణం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఖదీర్ ఖాన్ భార్య సిద్దేశ్వరి ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
దొంగతనం చేసినట్టు ఆధారాలు ఉన్నాయా..? అని ఆమె ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఏ విధంగా కొట్టారని, మరణించాక పోస్టుమార్టం దగ్గరికి ఎందుకు భార్యను రానివ్వలేదని ప్రశ్నించారు. కేవలం ముస్లిం అనే వివక్ష కనిపిస్తుందని, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.
పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని, పరిహారం పట్ల ఎందుకు స్పందన లేదన్నారు. ముస్లిం, మత వివక్షతోనే ఈ కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. డీజీపీ, చీఫ్ సెక్రెటరీని కమిషన్ ముందుకు పిలుస్తామన్నారు.
తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, బాధితురాలికి న్యాయం జరగాలన్నారు. కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా ఎందుకు రాయించారు, పోస్టుమార్టం చేసి ఇంటికి వచ్చే సమయంలో మూడు అంబులెన్స్ లు ఎందుకు మార్చారు, తగలబెట్టిన కాగితాలు ఏమిటని ఖదీర్ ఖాన్ భార్య సిద్దేశ్వరి ప్రశ్నించింది.
ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి
సిద్దేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, పిల్లల పేరిట 50 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయాలని, డబులు బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని షాహెజాది రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహే జాద్ కు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్వాగతం పలికారు. పూల బొకే ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.
బీజేపీ నాయకుల పరామర్శ
ఖదిర్ ఖాన్ భార్య సిద్దేశ్వరి కుటుంబ సభ్యులను మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ ఖాన్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు విజయ్ కుమార్, నాయిని ప్రసాద్, మధు, మైనార్టీ మోర్చా నాయకులు హీదాయత్ అలీ, ముజీబ్, భాస్కర్, అమీనా బేగం, సైఫుల్లా ఖాన్, అబ్బాస్, పాషా తదితరులున్నారు. కాగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హఫిజోద్దిన్ మైనార్టీ కమిషన్ సభ్యురాలు ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఖదీర్ ఖాన్ కేసులో పోలీస్‌లు చర్యలు తీసుకోవాలని కోరారు.