Rahul Gandhi | రాహుల్ గాంధీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈ నెల 21న విచారణ..!
Rahul Gandhi | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ నెల 21న పిటిషన్‌పై విచారణకు రానున్నది. మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా.. స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై అత్యవసర జాబితాను […]

Rahul Gandhi | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ నెల 21న పిటిషన్‌పై విచారణకు రానున్నది. మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా.. స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై అత్యవసర జాబితాను కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మంగళవారం ప్రస్తావించారు.
పిటిషన్‌ను శుక్రవారం విచారణకు జాబితా చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరు ఉంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీని ఉద్దేశించి దేశం విడిచిపారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీతో పోల్చారు. దీనిపై గుజరాత్‌కు చెందిన అప్పటి మంత్రి పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని సైతం కోల్పోయారు. ఇదిలా ఉండగా.. అయితే, ఇంతకు ముందు పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సమయంలో తమ వాదనలను సైతం వినాలని ఆయన కోరారు.