Rahul Gandhi | విధాత: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జనాల నుంచి విశేష స్పందన వస్తున్నది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రజలతో రాహుల్ మమేకం అవుతూ.. వారి సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ ఆయన యాత్ర దిగ్విజయవంతంగా సాగుతున్నది.
ఇటీవల ఓ చిన్న పిల్లవాడు రాహుల్‌ను కలవడానికి భద్రతా సిబ్బంది పెట్టిన ఆంక్షలను అధిగమించాడు. ఆ సన్నివేశాన్ని మొత్తం పరిశీలించిన రాహుల్ తెలంగాణలో జోడో యాత్ర ముగింపు సభలో ఈ ప్రాంత పోరాట స్ఫూర్తిని కొనియాడిన విషయం విదితమే. అలాంటి ఓ ఆసక్తికర సన్నివేశం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో నాలుగో రోజు ఆయన పాదయాత్రలో చోటు చేసుకున్నది.
ప్రియాంక గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు.. త్వరలో సమీక్ష
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరిస్తుందో, ప్రతి పక్ష నేతలు ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఎలా గొంతు నొక్కుతున్నది చెప్పడానికి రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన సభను ఉపయోగించుకున్నారు. ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
రాహుల్ తన ప్రసంగం కొనసాగిస్తుండగా ఒక్కసారిగా మైక్ ఆఫ్ అయిపోయింది. రాహుల్ ఏం మాట్లాడుతు న్నారో ఎవరికి వినిపించలేదు. దీంతో అక్కడ ఏం జరిరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన మళ్లీ ఏదో చెబుతుండగా మైక్ ఆన్ అయింది. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఇదంతా చేసింది తానే అని రాహుల్ చెప్పారు.
ఎందుకు ఇలా చేశానంటే.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తుందని చెప్పడానికే అని రాహుల్ తెలిపారు. ఈ స్విచ్ నా కంట్రోల్‌లో ఉన్నది కాబట్టి ఆన్ ఆఫ్ చేయగలిగాను. కానీ పార్లమెంట్‌లో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా మమ్మల్ని ఎలా అడ్డుకుంటున్నారో మీకు చెప్పడానికే నేను ఇలా చేశాను.
2016లో నోట్ల రద్దు గురించి మాట్లాడితే మైక్ ఆఫ్.. భారత్ భూ భాగాన్ని చైనా ఆక్రమిస్తోందని పార్లమెంట్‌లో గొంతు వినిపిస్తుంటే మైక్ ఆఫ్ అయ్యేదని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడిన విషయాలను ప్రజలకు వినపడకుండా చేస్తున్నారని అందుకే భారత్ జోడో యాత్రలో తమ గొంతు వినిపిస్తూ, అందర్నీ ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అరాచక పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రత అంశాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీల గొంతును పార్లమెంట్‌లో నొక్కేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.
मुद्दे की बात करोगे तो माइक बंद हो जाएगा – राहुल गांधी pic.twitter.com/NfjhaK8tTa
— Supriya Shrinate (@SupriyaShrinate) November 10, 2022