JP Nadda: రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే: జేపీ నడ్డా

విధాత‌: రాహుల్‌(Rahul) వ్యాఖ్యలపై బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా మండిపడ్డారు. దేశం కాంగ్రెస్‌(Congress) పార్టీ(Party)ని తిరస్కరిస్తున్న సమయంలో భారత్‌(Bharat)లో బలహీన ప్రభుత్వం ఉండాలని అప్పుడే తమ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆశిస్తున్న వారికి అనుకూలంగా రాహుల్‌ పనిచేస్తున్నారని నడ్డా ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న విదేశీ శక్తులకు అనుకూలంగా కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌నేతలు పాకిస్తాన్‌ గొంతుకలో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. దేశ అంతర్గత వ్యవహారంలో విదేశీ శక్తుల జోక్యం […]

  • Publish Date - March 17, 2023 / 12:14 PM IST

విధాత‌: రాహుల్‌(Rahul) వ్యాఖ్యలపై బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా మండిపడ్డారు. దేశం కాంగ్రెస్‌(Congress) పార్టీ(Party)ని తిరస్కరిస్తున్న సమయంలో భారత్‌(Bharat)లో బలహీన ప్రభుత్వం ఉండాలని అప్పుడే తమ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆశిస్తున్న వారికి అనుకూలంగా రాహుల్‌ పనిచేస్తున్నారని నడ్డా ఆరోపించారు.

భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న విదేశీ శక్తులకు అనుకూలంగా కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌నేతలు పాకిస్తాన్‌ గొంతుకలో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. దేశ అంతర్గత వ్యవహారంలో విదేశీ శక్తుల జోక్యం కోరినందుకు రాహుల్‌ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. విదేశాల్లో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్న రాహుల్‌ను పార్లమెంటు బహిష్కరించాలని నడ్డా సూచించారు.

రాహుల్‌ కంటే ముందు మోడీనే క్షమాపణలు చెప్పాలి: శశిథరూర్‌

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాహుల్‌గాంధీ అనని మాటలపై బీజేపీ దుష్ఫ్రచారం చేస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ విమర్శించారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు రాహుల్‌ చేయలేదన్నారు. రాజకీయాల్లో బీజేపీ తేలికగా వ్యవహరిస్తున్నదన్న ఆయన చేయని తప్పుకు రాహుల్‌ క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. ఆ విషయానికి వస్తే ప్రధాని మోడీనే రాహుల్‌ కంటే ముందు క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు. విదేశీ పర్యటనలో మోడీ దేశ రాజకీయాలు చాలా సార్లు ప్రస్తావించారని థరూర్‌ గుర్తుచేశారు.