నెల రోజుల్లో పోడుభూములకు పట్టాలు: గుత్తా, నల్లమోతు
విధాత: రాబోయే నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలు అందిస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్. భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణములో సంత్ సేవాలాల్ మాహరాజ్ గారి 284 వ జయంతి సందర్బంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి గిరిజన సంప్రదాయ నృత్యాలతో బంజారా భవన్ (సంత్ సేవాలాల్ భవన్) వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ జీవితం ఆదర్శం ముఖ్య అతిధులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ […]

విధాత: రాబోయే నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలు అందిస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్. భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణములో సంత్ సేవాలాల్ మాహరాజ్ గారి 284 వ జయంతి సందర్బంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి గిరిజన సంప్రదాయ నృత్యాలతో బంజారా భవన్ (సంత్ సేవాలాల్ భవన్) వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు.
సేవాలాల్ జీవితం ఆదర్శం
ముఖ్య అతిధులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, అగ్రోస్ & ట్రైకార్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, ఇస్లావత్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా గుత్తా, భాస్కర్ రావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త, సంఘ సేవకుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నారు.
మనిషి ఎలా బతకాలో నేర్పిన ఆయన జీవితం ఆదర్శమని, అందరూ ఆచరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భావించిన తర్వాత గిరిజనుల ఆరాధ్యదైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు 6శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
గిరిజన సంక్షేమశాఖలో 1,650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. 1,287 తండాలకు, గూడేలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.1,385 కోట్లు మంజూరు చేసిందన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గంలో నూతన తండాలకు 10 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 183 గిరిజన గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయగా 75,410 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో 1 కోటి రూపాయలతో బంజారా భవన్ (సంత్ సేవాలాల్ భవన్) భవనాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబునాయక్, ఆర్డిఓ బి.చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులూ స్కైలాబ్ నాయక్, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,
ఎంపిపిలు నూకల సరళహన్మంతరెడ్డి, ధీరావత్ నందిని, బాలాజీనాయక్, భగవాన్ నాయక్, జడ్పిటీసిలు అంగోతు లలిత హాతిరాంనాయక్, సేవ్యానాయక్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ మేఘ్యా నాయక్, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, వింజం రాజేంద్రప్రసాద్, వైస్ ఎంపిపిలు, అన్నీ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, గిరిజను నాయకులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువకులు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.