Raja Singh | బీఆర్‌ఎస్‌లోకి రాజాసింగ్‌?

Raja Singh హరీష్‌రావుతో రాజాసింగ్ భేటీ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం కొట్టిపారేసిన రాజాసింగ్‌ విధాత: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ శుక్రవారం రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్‌రావుతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ కొంతకాలంగా బీజేపీ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, తనపై బీజేపీ విధించిన సస్పెన్షన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్నారని ఈ నేపధ్యంలో ఆయన బీఆరెస్‌లో చేరేందుకే హరీష్‌రావుతో భేటీ అయ్యారన్న ప్రచారం రేగింది. అయితే హరీష్‌రావుతో తన […]

  • Publish Date - July 14, 2023 / 01:04 AM IST

Raja Singh

  • హరీష్‌రావుతో రాజాసింగ్ భేటీ
  • బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం
  • కొట్టిపారేసిన రాజాసింగ్‌

విధాత: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ శుక్రవారం రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్‌రావుతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాజాసింగ్ కొంతకాలంగా బీజేపీ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, తనపై బీజేపీ విధించిన సస్పెన్షన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్నారని ఈ నేపధ్యంలో ఆయన బీఆరెస్‌లో చేరేందుకే హరీష్‌రావుతో భేటీ అయ్యారన్న ప్రచారం రేగింది.

అయితే హరీష్‌రావుతో తన భేటీ కారణంగా తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలోనే బతుకుతానని, బీజేపీలోనే చనిపోతానని, తాను పార్టీ మారే అవకాశం లేదన్నారు.

తన నియోజకవర్గంలోని ఆసుపత్రి సమస్యపై చర్చించేందుకే తాను హరీష్‌రావుతో భేటీ అయ్యానని రాజాసింగ్ స్పష్టం చేసి తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.