Rajgopal Reddy | ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా.. ఊహాగానాలు నమ్మొద్దు: రాజగోపాల్ రెడ్డి

విధాత : తన పార్టీ మార్పుపై అనవసర ఉహాగానాలు వద్దని, ప్రస్తుతం బిజేపి లోనే కొనసాగుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajgopal Reddy) స్పష్టం చేశారు. బిఆర్ఎస్ బిజెపి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ కు వివరిస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారన్నారు. […]

  • By: Somu    latest    Jun 24, 2023 12:59 PM IST
Rajgopal Reddy | ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా.. ఊహాగానాలు నమ్మొద్దు: రాజగోపాల్ రెడ్డి

విధాత : తన పార్టీ మార్పుపై అనవసర ఉహాగానాలు వద్దని, ప్రస్తుతం బిజేపి లోనే కొనసాగుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajgopal Reddy) స్పష్టం చేశారు. బిఆర్ఎస్ బిజెపి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ కు వివరిస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారన్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుందని, అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అన్నారు. కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు.

నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందనన్నారు. మోదీ, అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుందన్నారు.