Rajamouli | రాజ‌మౌళిని ఆయ‌న కొడుకు ఇప్ప‌టికీ నాన్న అని పిల‌వ‌రా.. కార‌ణం ఏంటి?

Rajamouli: రాజ‌మౌళి .. ఈ పేరు చెప్ప‌గానే తెలుగు సినీ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకాయంటే ఎలాంటి అతిశ‌యోక్తి కాదు. మొన్న‌టి వ‌ర‌కు తెలుగు సినిమా గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారికి తెలుగు సినిమా స‌త్తా ఏంటో చూపించిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి. ఒక్కో సినిమాకి మూడు నాలుగు సంవ‌త్స‌రాల పాటు స‌మ‌యాన్ని తీసుకున్నా కూడా ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టి సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో […]

  • By: sn    latest    Jul 01, 2023 1:37 PM IST
Rajamouli | రాజ‌మౌళిని ఆయ‌న కొడుకు ఇప్ప‌టికీ నాన్న అని పిల‌వ‌రా.. కార‌ణం ఏంటి?

Rajamouli: రాజ‌మౌళి .. ఈ పేరు చెప్ప‌గానే తెలుగు సినీ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకాయంటే ఎలాంటి అతిశ‌యోక్తి కాదు. మొన్న‌టి వ‌ర‌కు తెలుగు సినిమా గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారికి తెలుగు సినిమా స‌త్తా ఏంటో చూపించిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి. ఒక్కో సినిమాకి మూడు నాలుగు సంవ‌త్స‌రాల పాటు స‌మ‌యాన్ని తీసుకున్నా కూడా ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టి సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఏ ఒక్క సినిమా కూడా ఏ కెట‌గిరీలోను ఆస్కార్ అందించ‌లేక‌పోయింది. ఆ కోరిక‌ని కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌తో తీర్చాడు జ‌క్క‌న్న‌.

రాజ‌మౌళి టాలెంట్, ఆయ‌న ముక్కు సూటిత‌నం, ప‌నిపై ఉన్న ఏకాగ్రత ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్య‌క్తి రాజ‌మౌళి. అయితే ఆయ‌న ఇంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించ‌డం వెన‌క ఆయ‌న ఫ్యామిలీ కూడా ఉంది. సంగీద ద‌ర్శ‌కుడు కీరవాణి, ఆయ‌న భార్య శ్రీవ‌ల్లి, రాజ‌మౌళి స‌తీమ‌ణి రమా రాజమౌళి, కీర‌వాణి కొడుకు కాల భైరవ, రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అలాగే రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఇలా ఫ్యామిలీ మొత్తం రాజ‌మౌళి సినిమాల కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తారు. అయితే వీరిలో కీల‌క స్థానంగా ఉంటుంది. రమా రాజమౌళి మొదటి భర్త సంతానం కార్తికేయ కాగా, ఆయ‌నని సొంత కొడుకులా చూసుకుంటాడ‌ట జక్క‌న్న‌.

కార్తికేయ కూడా రాజ‌మౌళిని త‌న సొంత తండ్రిలా భావించి ఆయ‌న కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తారు. రాజ‌మౌళి సినిమాల‌కి సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్ తో పాటు అనేక విషయాలు చూసుకుంటారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసే ప్రాసెస్ నుండి ఈ మూవీ క్యాంపైన్ బాధ్యతలు అన్నీ కూడా కార్తికేయ చూసుకున్నాడు. అందుకే ఆస్కార్ వేదికపై నుండి కీరవాణి కార్తికేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఇక తాజాగా రాజ‌మౌళి, కార్తికేయ సంబంధించిన విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అయింది. రాజ‌మౌళిని కార్తికేయ నాన్న‌, డాడా అని పిల‌వ‌ర‌ట‌. మొదటి నుండి బాబా అని పిలుస్తార‌ట‌. అలానే పిల‌వ‌డం త‌న‌కు అల‌వాటు అయిందని కార్తికేయ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఏది ఏమైన స్టెప్ స‌న్‌ని త‌న కొడుకులా స్వీక‌రించి అన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం రాజ‌మౌళి గ్రేట్ నెస్ అని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.