Sirisilla | రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు.. NMC గ్రీన్ సిగ్నల్

Sirisilla, NMC 2023-24 విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం అందుబాటులోకి రానున్న 100 ఎంబిబిఎస్ సీట్లు విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల(Sirisilla) జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి(NMC) అనుమతి మంజూరు చేసింది.  2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) అసెమెంట్ చేసిన 5 రోజుల్లోనే […]

  • By: krs    latest    Apr 22, 2023 2:19 AM IST
Sirisilla | రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు.. NMC గ్రీన్ సిగ్నల్

Sirisilla, NMC

  • 2023-24 విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం
  • అందుబాటులోకి రానున్న 100 ఎంబిబిఎస్ సీట్లు

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల(Sirisilla) జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి(NMC) అనుమతి మంజూరు చేసింది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) అసెమెంట్ చేసిన 5 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయడం విశేషం. వైద్య కళాశాల ప్రారంభానికి అనుమతులు లభించడంతో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Padi Kaushik Reddy: ఈటల, రేవంత్ ఇద్దరు తోడు దొంగలే.. IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: ప్రభుత్వ విప్‌ కౌశిక్ రెడ్డి

వైద్య కళాశాలకు అనుమతులు మంజూరు చేసిన ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో సకల వసతులు.. ఆధునిక హంగులతో రాజన్న సిరిసిల్ల(Sirisilla) జిల్లా మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి.

మంత్రి కేటీఆర్ హర్షం

రాజన్న సిరిసిల్ల(Sirisilla) ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Karimnagar: CLPనేత పాద‌యాత్ర‌లో అకాల వ‌ర్షం.. కూలిన టెంట్లు.. త‌డిసిన భ‌ట్టి

Karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పిడుగుపాటుకు ఒకరి మృతి