విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నూతన కలెక్టర్ గా రాజర్షి షా ను ప్రభుత్వం నియమించింది. మంగళవారం భారీగా ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది.
అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న 2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి రాజర్షి షా ను మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమించారు.
మెదక్,మేడ్చల్ జిల్లాల కలెక్టర్ గా ఉన్న హరీష్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది.