Gamechanger Review: రామ్‌చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ ఎలా ఉందంటే? ట్విట్టర్ రివ్యూ

  • By: sr    latest    Jan 10, 2025 8:12 AM IST
Gamechanger Review: రామ్‌చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ ఎలా ఉందంటే? ట్విట్టర్ రివ్యూ

విధాత‌: ఎన్నో అంచ‌నాల మ‌ధ్చ జ‌న‌వ‌రి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన గేమ్‌ఛేంజ‌ర్ చిత్రం. మూడేండ్ల క్రితం 2021లో ప్రారంభ‌మైన ఈ సినిమా అనేక అవ‌రోధాల‌ను దాటుకోని భారీ బ‌డ్జెట్‌తో సుమారు రూ.400 కోట్ల‌తో తెర‌కెక్కింది. ఉద‌యం ఒంటి గంట షోతో ప్రారంభ‌మైన ఈ మూవీని ఇప్ప‌టికే చాలామంది చూసి త‌మ అభిప్రాయాన్ని మీడియా ప‌రంగా, సోష‌ల్ మీడియాల ద్వారా వెళ్లడిస్తున్నారు. అయితే మూవీ విడుద‌లైన అన్ని చోట్ల నుంచి మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. సినిమా చూసిన చాలామంది.. మూవీ రోటిన్ స్టోరీతోనే సాగింద‌ని, కొత్త‌ద‌నం మిస్ అయింద‌ని, అంటుండ‌గా మ‌రికొంత మంది సినిమా ఫ‌స్టాప్ క‌న్నా సెకండ్ బావుంద‌ని అంటున్నారు.

అదేవిధుగా హీరోయిన్ కియారా కేవ‌లం పాట‌లకే ప‌రిమిత‌మైంద‌ని, అంజ‌లి పాత్ర బావుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ డ్రామాగానే సాగింద‌ని, కామెడీ అంత‌గా వ‌ర్కౌట్‌ లేద‌ని ఒక్క‌సారి చూసేయ‌వ‌చ్చు అంటున్నారు. ఇకా కొంత‌మంది పుష్ప‌లో పొల్చుతూ.. ఆ రేంజ్‌లో ఊహించామ‌ని కానీ సినిమా ఆ స్థాయిలో లేద‌ని పెద‌వి విరుచుతున్నారు. సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్ క్యారెక్ట‌ర్లు బావున్నాయ‌ని, పాట‌లు అదిరిపోయాయ‌ని, విజువ‌ల్స్ వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయ‌ని, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ సినిమాకు ప్ర‌ధాన బ‌లం చేకూర్చింద‌ని ఆ భారీ త‌నం క‌నిపించింద‌ని అంటున్నారు.

ఇలా చాలామంది చాలా ర‌కాలుగా సినిమాపై కామెంట్లు పెడుతూ. పోస్టులు పెడుతూ..త‌మ‌ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇదిలాఉంటే ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య RRR భారీ హిట్ చిత్రం అనంత‌రం వ‌స్తున్న‌రామ్‌చ‌ర‌ణ్ నుంచి వ‌స్తున్న‌ సినిమా కావడంతో అంచ‌నాలు భారీగానే ఉన్నా ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌డం విష‌యంలో వెన‌క‌బ‌డిన‌ట్లు బుకింగ్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

చాలా ప్రాంతాల్లో హౌజ్‌ఫుల్ బోర్డులు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదీగాక ఇటీవ‌ల అల్లు అర్జున్ వ్య‌వ‌హారం వ‌ళ్ల నెగిటివిటీ రావ‌డం కూడా ఈ సినిమాకు మైన‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. చూడాలి డాకు మ‌హారాజ్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల‌న ప్రేక్ష‌కులు ఆద‌రించిన దాన్ని బ‌ట్టి ఈ సినిమా ఫ‌లితం తేల‌నుంది.