Ramoji Rao | రామోజీ రావుకు ఊహించని పరిణామం.. ఆస్తుల ఎటాచ్ మామూలు షాక్ కాదు
Ramoji Rao విధాత: ఇంతవరకూ ఉపరాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా తనను కలవడమే తప్ప తాను ఎవర్నీ కలిసింది లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలన్న.. ఎవరు పొజిషన్లో ఉండాలన్నా.. ఎవరు ఎక్కడ కూర్చోవాలన్నా తానూ అక్కడ కూచుని డిసైడ్ చేస్తారు. అలాంటి పెద్ద మనిషి ఇంటికి పోలీసులు వెళ్లడం… మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి విచారించడం.. ఏ -1 గా కేసు బుక్ చేయడం. ఇదంతా కలలో […]

Ramoji Rao
విధాత: ఇంతవరకూ ఉపరాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా తనను కలవడమే తప్ప తాను ఎవర్నీ కలిసింది లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలన్న.. ఎవరు పొజిషన్లో ఉండాలన్నా.. ఎవరు ఎక్కడ కూర్చోవాలన్నా తానూ అక్కడ కూచుని డిసైడ్ చేస్తారు. అలాంటి పెద్ద మనిషి ఇంటికి పోలీసులు వెళ్లడం… మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి విచారించడం.. ఏ -1 గా కేసు బుక్ చేయడం. ఇదంతా కలలో జరిగినట్లు అయిపొయింది.
అప్పుడెప్పుడో వైఎస్సార్ ఒకసారి రామోజీ రావును టచ్ చేసారు కానీ కదిలించలేకపోయారు.. కానీ జగన్ వచ్చాక పరిస్థితి మారిపోయింది.. తానూ సార్వభౌముడిని అని, సర్వం తానే అని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన రామోజీ రావు రూ. 793 కోట్ల ఆస్తుల ఎటాచ్మెంట్ అనేది టిడిపి, ఈనాడు ఆయన అనుంగు వర్గాల్లో సంచలనం ఐంది. వందలకోట్ల డిపాజిట్ల డబ్బు వేర్వేరు వ్యాపారాల్లోకి మళ్లించడం పెద్ద నేరం.. అసలు డిపాజిట్లు తీసుకోవడం అన్నిటికన్నా పెద్ద నేరం.. ఇవన్నీ కలగలిపి రామోజీని సీఐడీ బోనులో నిలబెట్టాయి.
ఇన్నాళ్లూ ఆయనను ఎవరూ ప్రశ్నించజాలరు అనుకున్నది కాస్తా ఆయన్ను ఏకంగా ఏ-1 అనే స్థాయికి తెచ్చింది. ఇది ఇప్పుడు టిడిపి సర్కిళ్లలో పెద్ద చర్చకు దారితీసింది. సీఐడీ కేసుల దెబ్బకు మార్గదర్శి సంస్థల్లోకి కొత్త చిట్స్ రావడం లేదు.. ఉన్నవాటిని గమ్మున ముగించి ఇమ్మని ఖాతాదారులు ఒత్తిడి చేస్తున్నారు. తిరిగి చెల్లించేందుకు రామోజీ వద్ద లిక్విడ్ క్యాష్ లేదు.. బయటి నుంచి ఇష్టానుసారం డబ్బు తెచ్చే వెసులుబాటును సీఐడీ నిరోధించేసింది. దీంతో రామోజీ తీవ్ర ఇబ్బందుల నడుమ ఉన్నారు.
దీన్ని పత్రికల మీద దాడిగా కొన్నాళ్ళు చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దీంతో పోయిన పరువును మళ్ళీ నిలబెట్టుకునేందుకు 87 ఏళ్ళ వయసులో అయన శతథా యత్నిస్తున్నారు. మరోవైపు
జస్ట్ ఆస్తుల ఎటాచ్మెంట్ వద్దనే ఆగుతుందా.? మున్ముందు అరెస్ట్ వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయా.? చూడాలి మరి..