వరంగల్: మైనర్‌పై అత్యాచార యత్నం.. పోలీసుల అదుపులో యువకుడు

విచార‌ణ చేప‌ట్టిన 'స్టేషన్' పోలీసులు విధాత, వరంగల్: వరంగల్ నగరంలోని దయానందకాలనీలో దళిత మైనర్‌ బాలికపై పొరుగున ఉండే ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్‌లో మైనర్‌ బాలిక (1౦) పై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక రెండుమూడు రోజులుగా ముభావంగా ఉండటంతో […]

  • By: krs    latest    Jan 06, 2023 11:16 AM IST
వరంగల్: మైనర్‌పై అత్యాచార యత్నం.. పోలీసుల అదుపులో యువకుడు
  • విచార‌ణ చేప‌ట్టిన ‘స్టేషన్’ పోలీసులు

విధాత, వరంగల్: వరంగల్ నగరంలోని దయానందకాలనీలో దళిత మైనర్‌ బాలికపై పొరుగున ఉండే ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్‌లో మైనర్‌ బాలిక (1౦) పై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక రెండుమూడు రోజులుగా ముభావంగా ఉండటంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఈ సంఘటన‌ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మండలంలోని సముద్రాలకు చెందిన పులి రజనీ కుమార్ (33)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను నమ్మించి అత్యాచార యత్నం చేసినట్లుగా ప్రాథ‌మిక విచార‌ణ‌కు వ‌చ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బాధ్యుడిని నుంచి పోలీసులు కూపీ లాగుతున్నారు.