Rasi Phalalu Weekly | వార ఫలాలు (04.06.2023 నుంచి 10.06.2023) ఆ రాశుల వారు.. రియల్ ఎస్టేట్, నిర్మాణలకు దూరంగా ఉంటే మంచిది
Rasi Phalalu Weekly | వార ఫలాలు | 04.06.2023 నుంచి 10.06.2023 వరకు మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం): ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. స్పెక్యులేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. చిన్నచిన్న చేబదళ్లు కూడా పుట్టే అవకాశాలు ఉండవు. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎవ్వరితోనూ వాదములకు దిగకండి. భూముల క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాలు ఆగుతాయి. […]

Rasi Phalalu Weekly | వార ఫలాలు | 04.06.2023 నుంచి 10.06.2023 వరకు
మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం):
ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. స్పెక్యులేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. చిన్నచిన్న చేబదళ్లు కూడా పుట్టే అవకాశాలు ఉండవు. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎవ్వరితోనూ వాదములకు దిగకండి. భూముల క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాలు ఆగుతాయి.
కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది. మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య విషయాల్లో కొన్ని సమస్యలు రావొచ్చు. ఇంటిలో తగాదాలను, ఘర్షణలను నివారించుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. 08.06.2023న బుధుడు 2వ ఇంటకు మారుతున్నందున రానున్న రోజుల్లో అన్ని విషయాల్లోనూ పరిస్థితులు మెరుగువుతాయి.
వృషభ రాశి (కృత్తిక 2, 3, 4 ; రోహిణి ; మృగశిర 1, 2 పాదాలు)
ఆర్థికంగా బాగా కష్టంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు అందడంలో ఆలస్యమవుతుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం. ఆర్థిక విషయాలు ఆలోచన చేసేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలి. అంతా బాగుంటుందని ఊహించి చేసే పనులు ఫలించవు. వివిధ వృత్తుల వారికి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
వాదమలుకు దిగినప్పడు జాగ్రత్తగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఓ మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో మంచి వాతావరణం ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. మనసు హాయిగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొంత ఉపశమనం కలుగుతుంది.
మిథునరాశి (మృగశిర 3, 4; ఆరుద్ర; పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఆర్థిక విషయాలు సజావుగా సాగిపోతాయి. ఎంపిక చేసిన వాటిలో ఊహించి పనులు చేయడం, తగిన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఓ మోస్తరు విజయాలు పొందవచ్చు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వాదములకు దిగిన సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించడం మంచిది. ఇంట్లో దాదాపు సంతోషాలు ఉంటాయి. విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కొంత ఉపశమనం లభిస్తుంది.
కర్కాటకరాశి (పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష)
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చులపై నియత్రణ ఉంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆలోచనలు చేసేటప్పుడు, ప్రణాళికలు రూపొందించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫలితాన్ని ఊహంచి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వృత్తిపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
వాదాలకు దిగినప్పుడు జాగరూకతతో ఉండాలి. భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లను వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. ఇంటిలో సుఖశాంతులు ఉంటాయి. ఇతరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
సింహరాశి (మాఘ, పూర్వ ఫాల్గుణి, ఉత్తర 1వ పాదము)
ఆర్థిక విషయాలు సవ్యంగా సాగిపోతాయి. ఎంపిక చేసిన విషయాల్లో ఫలితాన్ని ఊహించే చేసే పనులు, ప్రణాళికలు ఓ మోస్తరు విజయాన్ని ఇస్తాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం కలుగుతుంది. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవ్వరితోనూ వాదములకు దిగవద్దు.
భూమి లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. మనసు స్థిరంగా ఉండదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంటిలో ఘర్షణ వాతావరణాన్ని నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగస్థులు ఆహారం, ఔషధాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యారాశి (ఉత్తర 2, 3, 4; హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఆర్థికంగా కష్టంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు సమయానికి అందవు. నియత్రణలేని ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఊహించి చేసే పనులు ఫలితాలనివ్వవు. వృత్తిపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
వాదములలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో ఓ మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించేందుకు ప్రయత్నించవచ్చు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. విభేదాలు పరిష్కారం అవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలేమీ ఉండవు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొంత మేర ఉపశమనం లభిస్తుంది.
తులా రాశి (చిత్త 3, 4, పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు)
ఆర్థిక విషయాల్లో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిలు సమయానికి అందవు. నియంత్రణలేని ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు ఆలోచన చేసేటప్పుడు, నిర్వహించేటప్పుడు జాగరూకతతో ఉండాలి. ఊహించి చేసే పనులు ఫలితాలనివ్వవు. వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవ్వరి తోనూ వాదములకు దిగకండి.
భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లను వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో సామరస్యపూర్వక వాతావరణ దెబ్బతినే అవకాశం ఉన్నది. భౌతిక, మానసిక సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు.
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిలు సమయానికి అందవు. పరిమితి లేని ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రణాళిక, నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించి చేసే పనులు ఫలితాలనివ్వవు. వృత్తిపరమైన కార్యకలాపాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
వాదములలో జాగ్రత్తగా ఉండాలి. భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు మందగిస్తాయి. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో సామరస్య వాతావరణం ఉంటుంది. విభేదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగస్థులకు కొంత ఉశమనం లభిస్తుంది.
ధనూరాశి (మూలా; పూర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ 1వ పాదము)
ఆర్థికంగా చక్కటి పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందగలరు. స్పెక్యులేషన్‌తో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. వృత్తిపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.
రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మోస్తరు పురోగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించేందుకు ప్రయత్నించ వచ్చు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. సౌఖ్యాలు అనుభవిస్తారు. విభేదాలు, అడ్డంకులు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉపశమనం పొందుతారు.
మకర రాశి (ఉత్తర ఆషాఢ2, 3, 4; శ్రవణ; ధనిష్ట 1, 2 పాదములు)
ఖర్చులు ఎక్కువ ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. ఊహించి చేసే పనుల్లో ఏ మాత్రం లాభం ఉండదు. ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న సాధారణ అప్పులు కూడా దొరకవు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవ్వరితోనూ వాదములకు దిగవద్దు.
భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు స్తంభిస్తాయి. కొనుగోళ్లు వాయిదా వేయండి. ఇంట్లో సామరస్య వాతావరణం ప్రభావితం కావచ్చు. శారీరక, మానసిక ఇబ్బందులు వేధించే అవకాశం ఉన్నది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఔషధాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదు.
కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదములు; శతభిష, పూర్వ భాద్ర 1 నుంచి 3 పాదములు)
ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. ఊహించి చేసే పనుల్లో ఏ మాత్రం ఫలితం ఉండదు. ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న చేబళ్లు కూడా దొరకవు. వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవ్వరితోనూ వాదములకు దిగకండి.
భూమి లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో సామరస్యం దెబ్బతినే అవకాశం ఉన్నది. శారీరక, మానసిక వేదన వేధిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఔషధాల విషయంలో అశ్రద్ధ తగదు.
మీనరాశి (పూర్వ భాద్ర 4, ఉత్తర భాద్ర; రేవతి)
ఆర్థిక అంశాలు సవ్యంగా సాగిపోతాయి. ఎంపిక చేసిన విషయాల్లో స్పెక్యులేషన్, ప్రణాళికలు మోస్తరు విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది. వృత్తిపరమైన కార్యకలాపాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్తగా ఉండాలి.
భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో సామరస్య వాతావరణ, సుఖాలు ఉంటాయి. విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కొత మేరకు ఉపశమనం కలుగుతుంది.