165 కోట్లతో టాటా పెట్స్ హాస్పిటల్
రతన్ టాటా పరిచయం అక్కర్లేని పారిశ్రామికవేత్త. దానగుణంలో మేటి. ఆయనకు లేరుసాటి. వచ్చే లాభాల్లో అధికశాతం దానధర్మాలకు వెచ్చిస్తున్న మానవతావాది.

- ముంబైలో వచ్చేనెలలో ప్రారంభం
- 2.2 ఎకరాల్లో అన్ని హంగులతో..
- కుక్కలు, పిల్లులు, కుందేళ్లు
- వంటి చిన్న జంతువులకు
- 24×7 నాణ్యమైన వైద్యసేవలు
విధాత: రతన్ టాటా పరిచయం అక్కర్లేని పారిశ్రామికవేత్త. దానగుణంలో మేటి. ఆయనకు లేరుసాటి. వచ్చే లాభాల్లో అధికశాతం దానధర్మాలకు వెచ్చిస్తున్న ఏకైక వ్యక్తి. గొప్ప మనస్సు మానవతావాది. రతన్‌టాటా పెంపుడు జంతువుల కోసం తలపెట్టిన ప్రాజెక్టు వచ్చేనెలలో సాకారం కాబోతున్నది. 86 ఏండ్ల వయస్సులో ఆయన ముంబైలో రూ.165 కోట్లతో పెట్స్ హాస్పిటల్ నిర్మించారు. అది అందుబాటులోకి వస్తే పెంపుడు జంతువులకు సదా నాణ్యమైన వైద్యం అందనున్నది.
రతన్ టాటా చాలాకాలంగా ‘పెంపుడు జంతువు’ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని భావిస్తున్నారు. ఆ సుదీర్ఘ కల త్వరలో సాకారం కాబోతున్నది. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను 2.2 ఎకరాల విస్తీర్ణంలో, ఐదు అంతస్థుల్లో రూ. 165 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నారు. ఈ దవాఖానలో ఒకే సారి 200 పెట్స్‌కు వైద్యం సామర్థ్యం ఉన్నది. ఈ పెట్స్ దవాఖాన మార్చి మొదటివారంలో ప్రారంభం కానున్నది. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇతర చిన్న జంతువుల కోసం 24×7 ప్రపంచస్థాయి నాణ్యమైన వైద్యం అక్కడ అందనున్నది.
జంతు ప్రేమికుడైన రతన్‌టాటా.. పెట్స్ దవాఖాన నిర్మాణానికి దారితీసిన అంశాలను వెల్లడించారు. “పెంపుడు జంతువులు నేడు ప్రతి కుటుంబంలో సభ్యుడిగా కలిసిపోతున్నాయి. నా జీవితాంతం అనేక పెంపుడు జంతువుల మధ్య సాగింది. వాటి సంరక్షకుడిగా, ఈ ఆసుపత్రి అవసరాన్ని గుర్తించాను. నా పెట్ డాగ్ కాలు విరిగినప్పుడు వైద్యం చేయించడానికి అనేక ఇబ్బందులు పడ్డాను. విదేశాల్లో సైతం సరైన చికిత్స లభించలేదు. అందుకే ప్రపంచ స్థాయి వెటర్నరీ దవాఖానను నిర్మించాలని భావించాను. ఇప్పుడు అది నెరవేరబోతున్నది ” అని రతన్‌టాటా వెల్లడించారు.