రేష‌న్ కార్డు ల‌బ్దిదారుల‌కు గుడ్ న్యూస్.. ఈ కేవైసీ గ‌డువు పొడిగింపు

రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారికోసం మరో అవకాశాన్ని కల్పించింది కేంద్ర‌ ప్రభుత్వం

రేష‌న్ కార్డు ల‌బ్దిదారుల‌కు గుడ్ న్యూస్.. ఈ కేవైసీ గ‌డువు పొడిగింపు

హైద‌రాబాద్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారికోసం మరో అవకాశాన్ని కల్పించింది కేంద్ర‌ ప్రభుత్వం. ప్ర‌స్తుత గ‌డువు జ‌న‌వ‌రి 31తో ముగియ‌నుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్తి కాలేదు. దీంతో రేష‌న్ కార్డుల‌ను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించే గ‌డువును ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు కేంద్రం పొడిగించింది.


తెలంగాణ‌లో రేష‌న్ కార్డుల ఈ కేవైసీ కేవ‌లం 75 శాతం మాత్ర‌మే పూర్త‌యింది. గ‌డువు పొడిగించ‌డంతో ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి 100 శాతం పూర్తి చేయాల‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, హైద‌రాబాద్ చీఫ్ రేష‌నింగ్ ఆఫీస‌ర్‌ను ఆదేశించారు