TV9 ఆఫీసుకు రవి ప్రకాశ్
ఎందుకు వచ్చాననే షయంతో తర్వాత చెపుతానన్న రవి ప్రకాశ్ విధాత: టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ పోలీసులతో మంగళవారం టీవీ9 ఆఫీస్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. టీవీ9 కార్యాలయానికి రవిప్రకాశ్ వచ్చాడని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఎందుకు వచ్చారని అడుగగతా కొద్ది క్షణాల్లో ఎందుకు వచ్చాననే విషయాన్ని మీడియాకు తెలియజేస్తానన్నారు. రవిప్రకాశ్ వెంట మరొకరు ఉన్నారు. వీరు లిఫ్ట్ లో కార్యాలయం లోపలికి వెళ్లారు. టీవీ 9 వ్యవస్థాపక సీఈఓ రవిప్రకాశ్‌ను […]

- ఎందుకు వచ్చాననే షయంతో తర్వాత చెపుతానన్న రవి ప్రకాశ్
విధాత: టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ పోలీసులతో మంగళవారం టీవీ9 ఆఫీస్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. టీవీ9 కార్యాలయానికి రవిప్రకాశ్ వచ్చాడని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఎందుకు వచ్చారని అడుగగతా కొద్ది క్షణాల్లో ఎందుకు వచ్చాననే విషయాన్ని మీడియాకు తెలియజేస్తానన్నారు. రవిప్రకాశ్ వెంట మరొకరు ఉన్నారు. వీరు లిఫ్ట్ లో కార్యాలయం లోపలికి వెళ్లారు.
టీవీ 9 వ్యవస్థాపక సీఈఓ రవిప్రకాశ్‌ను 2019లో కంపెనీ ప్రమోటర్లను మోసం చేశారన్న అభియోగంపై 2019 మే10వ తేదీన సీఈఓ పదవి నుంచి తొలగించారు. మెజార్టీ షేర్లను పొందిన అలంద మీడియా అండ్ ఎటర్ టైన్‌యమెంట్ సంస్థ రవి ప్రకాశ్‌ను తొలగించినట్లు ఆనాడు ప్రకటించింది. నాటి నుంచి రవి ప్రకాశ్ టీవీ9 కార్యాలయానికి ఏనాడు రాలేదు.. దాదాపు మూడేళ్ల తరువాత మొదటి సారిగా రవి ప్రకాశ్ టీవీ9 కార్యాలయానికి వెళ్లారు.
రవి ప్రకాశ్ టీవీ9 నుంచి బయటకు వెళ్లినప్పటికీ 8.5 శాతం వాటాదారుగా ఉన్నారు. మార్చి నెల కావడంతో అకౌంట్స్ చూసుకోవడానికి కార్యాలయానికి వచ్చి కంపెనీ సెక్రటరీని కలిసినట్లు తెలిసింది. కంపెనీ సెక్రటరీతో మాట్లాడిన అనంతరం రవి ప్రకాశ్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
#TV9 #RAVIPRAKASH #RTV #TELUGUNEWS pic.twitter.com/pYo4F4Awt5
— vidhaathanews (@vidhaathanews) February 21, 2023
అయితే సాయంత్రం ఈ విషయమై TV9 యాజమాన్యం స్పందించింది. రవి ప్రకాష్ కేవలం షేర్ హోల్డర్ మాత్రమేనని ఆయనకు టీవీ9తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
— TV9 Telugu (@TV9Telugu) February 21, 2023