అసిస్టెంట్‌ కారును తొలుతూ షూటింగ్‌కు.. మాస్ మహారాజా..! వీడియో వైరల్‌

విధాత: మాస్ మహారాజా రవితేజను వరుస అపజయాల అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ చిత్రం మళ్లీ లైన్‌లో నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వరుస ఫ్లాప్స్‌ ఆయనని వెంటాడుతున్నాయి. అయినా ఫలితాలతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ మరియు సున్నితమైన హాస్యం పండించడంలో దిట్టైనా న‌క్కిన‌ త్రినాధ రావు దర్శకత్వంలో ‘ధమాకా’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. […]

  • By: krs    latest    Dec 09, 2022 5:32 AM IST
అసిస్టెంట్‌ కారును తొలుతూ షూటింగ్‌కు.. మాస్ మహారాజా..! వీడియో వైరల్‌

విధాత: మాస్ మహారాజా రవితేజను వరుస అపజయాల అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ చిత్రం మళ్లీ లైన్‌లో నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వరుస ఫ్లాప్స్‌ ఆయనని వెంటాడుతున్నాయి. అయినా ఫలితాలతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ మరియు సున్నితమైన హాస్యం పండించడంలో దిట్టైనా న‌క్కిన‌ త్రినాధ రావు దర్శకత్వంలో ‘ధమాకా’ మూవీ చేస్తున్నాడు.

ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ర‌వితేజ‌కు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ చిత్రం రవితేజకు డు ఆర్ డై వంటిదేనని కూడా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 23న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మహారాజా రవితేజ విషయానికి వస్తే.. ఆయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్వయంకృషితో హీరోగా ఎదిగి మాస్ మహారాజా అనే బిరుదును అందుకున్నాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఇలా ప్రతిదీ ఒక విభిన్నం అయినా ఆయనకు వరుసగా ఈమధ్య పరాజయాలు ఎదురవుతున్నాయి. నటనలో కథలలో.. ఇతర అంశాల్లో కూడా మూస ధోరణిని అనుసరించడం వల్ల ఆయన చిత్రాల ఫలితాలు అలాగే వ‌చ్చాయి.