Redmi Note 12 Price | బెస్ట్‌ ఫీచర్స్‌ ఫోన్‌ తక్కువ ధరకే..! రెడ్‌మీ నోట్‌-12 4జీఫోన్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. షావోమీ తన రెడ్​మీ నోట్-12 4జీ సిరీస్ మొబైల్‌ను భారీగా తగ్గించింది.

Redmi Note 12 Price | బెస్ట్‌ ఫీచర్స్‌ ఫోన్‌ తక్కువ ధరకే..! రెడ్‌మీ నోట్‌-12 4జీఫోన్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

Redmi Note 12 Price | స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. షావోమీ తన రెడ్​మీ నోట్-12 4జీ సిరీస్ మొబైల్‌ను భారీగా తగ్గించింది. సిరీస్‌లో భారత్‌లో రూ.10,499 నుంచే ప్రారంభం కానుండగా.. ఈ గతేడాది మార్చిలో మొబైల్‌ ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. అయితే, మూడునెలల్లోనే ధరను భారీగా తగ్గించింది. దాంతో రూ.10వేల లోపు లభించే స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగింది. లాంచ్​ సమయమలో రెడ్​మీ నోట్-12 4జీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 కాగా.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్‌ ధర రూ.16,999 ఉండేది.

జనవరిలో ఈ రెండు ఫోన్ల ధరలను రూ.2వేల ధర తగ్గింది. తాజా తగ్గింపుతో రెడ్​మీ నోట్ 4జీ 6జీబీ ర్యామ్, 28జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గాను.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కి తగ్గింది. ఫ్లిప్​కార్ట్​లో డెబిట్, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ.1500 వరకు డిస్కౌంట్‌ తగ్గింపు లభించనున్నది. రెడ్​మీ నోట్ 12 4జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్ డీ ప్లస్‌ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండగా.. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 685 ప్రాసెసర్, అడ్రినో 610 జీపీయూ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్‌పై పని చేయనున్నది.

ఆప్టిక్స్ విషయానికొస్తే, మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్స్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాల కోసం ఫోన్​లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ప్రో మోడ్, డాక్యుమెంట్ మోడ్, షార్ట్ వీడియో, పనోరమ, కస్టమ్ వాటర్మార్క్, మూవీ ఫ్రేమ్, టిల్ట్ షిఫ్ట్, వాయిస్ షట్టర్, టైమ్డ్ బర్స్ట్, బ్యూటీఫై, మరెన్నో కెమెరా యాప్‌లో ఆప్షన్స్‌ ఉన్నాయి. బడ్జెట్​ ఫ్రెండ్లీ రెడ్​మీ నోట్ 12 4జీ స్మార్ట్​ఫోన్​లో 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ గ్యాడ్జెట్స్​కి మార్కెట్‌లోకి మంచి డిమాండ్‌ ఉన్నది.