Contract Teachers | 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ

Contract Teachers | ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం విధాత: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 16 ఏళ్లుగా పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను విడుదల చేసింది. అదే విధంగా ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు […]

  • By: krs    latest    Sep 05, 2023 12:33 AM IST
Contract Teachers | 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ

Contract Teachers |

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

విధాత: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 16 ఏళ్లుగా పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను విడుదల చేసింది.

అదే విధంగా ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రకటింప చేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయడం పట్ల రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.

గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాము చేసిన పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రెగ్యులర్ చేయడం పట్ల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునిత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంతో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉందన్నారు.