నగరవాసులకు శుభవార్త: నామమాత్రపు రుసుముతో భూముల క్రమబద్ధీకరణ

విధాత: కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రిజిస్ట్రేషన్‌, యూఎల్‌సీ సమస్యలకు సర్కార్‌ పరిష్కార మార్గం చూపింది. జీవో 118 ద్వారా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో మన నగరం పేర నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి ప్రకటించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. GO. No.118 ఈ నెల 28న విడుదలైంది. 1000 గజాల వరకు నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ రేటు కూడా […]

  • By: krs    latest    Nov 02, 2022 3:27 PM IST
నగరవాసులకు శుభవార్త: నామమాత్రపు రుసుముతో భూముల క్రమబద్ధీకరణ

విధాత: కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రిజిస్ట్రేషన్‌, యూఎల్‌సీ సమస్యలకు సర్కార్‌ పరిష్కార మార్గం చూపింది. జీవో 118 ద్వారా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో మన నగరం పేర నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి ప్రకటించారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. GO. No.118 ఈ నెల 28న విడుదలైంది. 1000 గజాల వరకు నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ రేటు కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా మంత్రి వివరించారు.

కోర్టు కేసులు, ఇతర కారణాలతో అడ్డుకుంటారనే ఉద్దేశంతో గజానికి రూ. 259 మాత్రమే పెట్టి ఈ జీవో విడుదల చేశామన్నారు. మీకు 100 గజాలు ఉంటే రూ. 25 వేల వరకు, 200 గజాలు ఉంటే రూ. 50 వేల వరకు, 400 గజాలు ఉంటే రూ. లక్ష కడితే వెంటనే క్రమబద్దీకరణ చేయించి పట్టాలు అందిస్తామన్నారు.

ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో నగరంలోని కార్వాన్, జూబ్లీహిల్స్, ఎల్బి నగర్, కార్వాన్, రాజేంద్ర నగర్, మేడ్చల్ వాసులకి ఊరట కలిగిందన్నారు. 6 జీహెచ్ఎంసీ నియోజకవర్గాలలో 44 కాలనీలలో క్రమబద్ధీకరించబడిన భూములతో వేలాది కుటుంబాలకు తక్షణం ఉపశమనం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా కలుగుతుందన్నారు.