రేవంత్ రెడ్డి అధైర్య పడొద్దు: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
విధాత: రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులందరం పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. రేవంత్ అధైర్యపడొద్దని, ఆయనకు భరోసాగా తామంతా ఉన్నామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయాలగూడెం వద్ద 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు సమావేశమయ్యారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పాదయాత్రపై చర్చించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పిన […]

విధాత: రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులందరం పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. రేవంత్ అధైర్యపడొద్దని, ఆయనకు భరోసాగా తామంతా ఉన్నామని చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయాలగూడెం వద్ద 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు సమావేశమయ్యారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పాదయాత్రపై చర్చించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పిన మంత్రి కేటీఆర్.. ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని కుంభం సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. చివరకు మునుగోడులో కోళ్లు, మేకలు కూడా దొరకడం లేదన్నారు. అయితే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కాల్ పై మాట్లాడేందుకు నిరాకరించారు.