మాది తోటి కోడ‌ళ్ల పంచాయ‌తీనే: రేవంత్‌ రెడ్డి.. జగ్గారెడ్డితో ఆసక్తికర సంభాషణ

నాకు పీసీసీ అధ్య‌క్షుడ‌వ్వాల‌నే ఆలోచ‌న లేదు రేవంత్ పాద‌యాత్ర‌కు నా పూర్తి మ‌ద్ద‌తు- జ‌గ్గారెడ్డి అసెంబ్లీలో ఎదురుబడ్డ రేవంత్, జగ్గారెడ్డి ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ విధాత‌: కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు జ‌గ్గారెడ్డికి మ‌ధ్య తోటి కోడ‌ళ్ల పంచాయ‌తీనే కానీ వేరే ఏ పంచాయ‌తీ లేద‌ని పీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కాగా రేవంత్ రెడ్డి చేసే పాద‌యాత్ర‌కు తాను పూర్తి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. శుక్ర‌వారం అసెంబ్లీలో ఇద్ద‌రు నేత‌లు ఎదురు […]

  • By: krs    latest    Dec 02, 2022 12:51 PM IST
మాది తోటి కోడ‌ళ్ల పంచాయ‌తీనే: రేవంత్‌ రెడ్డి.. జగ్గారెడ్డితో ఆసక్తికర సంభాషణ
  • నాకు పీసీసీ అధ్య‌క్షుడ‌వ్వాల‌నే ఆలోచ‌న లేదు
  • రేవంత్ పాద‌యాత్ర‌కు నా పూర్తి మ‌ద్ద‌తు- జ‌గ్గారెడ్డి
  • అసెంబ్లీలో ఎదురుబడ్డ రేవంత్, జగ్గారెడ్డి
  • ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ

విధాత‌: కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు జ‌గ్గారెడ్డికి మ‌ధ్య తోటి కోడ‌ళ్ల పంచాయ‌తీనే కానీ వేరే ఏ పంచాయ‌తీ లేద‌ని పీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కాగా రేవంత్ రెడ్డి చేసే పాద‌యాత్ర‌కు తాను పూర్తి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. శుక్ర‌వారం అసెంబ్లీలో ఇద్ద‌రు నేత‌లు ఎదురు ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తి క‌ర సంభాష‌ణ జ‌రిగింది. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి క‌లిసి క‌ట్టుగా ప‌ని చేస్తామ‌న్నారు.

ఈ మేర‌కు ఎన్నికలు అయిపోయే వరకు రేవంత్ గురించి మాట్లాడనని చెప్పారు. చెప్పాలనుకున్న విషయాలను చెప్పేశాన‌ని, తాను ముందు ఒకటి వెనకొకటిలా ఉండనని జగ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలాడుతాయి కానీ తాము ఓపెన్ గా ఉంటామ‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. కాగా రాత్రి ఏమి మాట్లాడుకున్నామో ఉదయం కూడా అదే మాట్లాడుకొని ప్ర‌శాంతంగా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు.

దీనికి స్పంధించిన జ‌గ్గారెడ్డి రేవంత్ ను దించి తాను పీసీసీ అధ్య‌క్షుడిని అవ్వాల‌నే అలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డమే ల‌క్ష్యంగా రేవంత్‌రెడ్డి చేప‌ట్టే పాద‌యాత్ర‌కు తాను పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి తెలిపారు.

తాను కానీ రేవంత్ కానీ వ్యూహాలు చెప్ప‌మ‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. మాట్ల‌డిన విష‌యాలల్లో వ్యూహం లేద‌ని మీడియా మిత్రుల‌కు జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. శ‌త్రువు మీద కొట్లాడే స‌మంలో త‌మ పార్టీ నాయ‌కులంతా క‌లిసి ప‌ని చేస్తామ‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. తాను మామూలుగా ఉండే వాడినైతే పారీ పోయేలా బ్రేకింగ్స్ వేస్తార‌ని రేవంత్ మీడియా ప్ర‌తినిధుల‌నుద్దేశించి అన్నారు.