Revanth Reddy
విధాత: రాష్ట్ర సచివాలయానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని పోలీసులు అడ్డకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూల్ టెండర్లలో జరిగిన అవకలపై ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేయడానికి సచివాలయానికి వెళుతున్న రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి సచివాలయం లోపలికి వెళ్లకుండా సచివాలయం వద్ద బారీ కేడ్లు వేశారు. తాను ఒక ఎంపీని, అధికారులను కలువడానికి తనకు పర్మిషన్ అవసరం లేదని, వస్తున్నట్లు సమాచారం ఇస్తే చాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సెక్రటేరియట్‌కు వెళ్లడానికి అనుమతి అవసరం లేదని తెలిపారు. తాను ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.