నాపై ఎందుకీ కక్ష.. పార్టీ కోసం ప్రాణాలిస్తా.. కన్నీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy | విధాత: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులపై తన మాటలతో విరుచుకుపడుతుంటారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ.. తనదైన శైలిలో ప్రత్యర్థి వర్గానికి చెమటలు పట్టించేలా ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. రాజకీయాల్లో ఎవరికీ బెదరని రేవంత్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కొంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో బోరున విలపించారు. తమ పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనపై […]

నాపై ఎందుకీ కక్ష.. పార్టీ కోసం ప్రాణాలిస్తా.. కన్నీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy | విధాత: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులపై తన మాటలతో విరుచుకుపడుతుంటారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ.. తనదైన శైలిలో ప్రత్యర్థి వర్గానికి చెమటలు పట్టించేలా ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. రాజకీయాల్లో ఎవరికీ బెదరని రేవంత్ రెడ్డి..

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కొంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో బోరున విలపించారు. తమ పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడనని రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి కన్నీళ్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు కుట్ర చేశారని, అందులో భాగంగానే కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, తనను పీసీసీ పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. పీసీసీగా రేవంత్ రెడ్డి రాణించలేకపోతున్నారని, ఆయన వల్లే పార్టీ బలహీనపడిందని నిరూపించాలని కొందరు నేతలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.

లాఠీ తూటాలకైనా, తుపాకీ గుండ్లకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు పనిచేస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో ఒంటరినయ్యాను. ఎవరు కుట్రలు చేస్తున్నారో తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయి. పీసీసీ పదవి సోనియా గాంధీ తనకు ఇచ్చిన అవకాశమని పేర్కొన్నారు. కానీ అప్పటినుంచి పార్టీలో తాను ఒంటరివాడినయ్యానని.. అందుకు బీజేపీ, కేసీఆర్ కుట్రలు కూడా ఓ కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్, మోదీ కలిసి ప్రయత్నిస్తున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేసీఆర్ సుపారీ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేసీఆర్ పది రోజుల పాటు ఉండి మోదీ, అమిత్ షా తో రహస్య సమావేశాలు జరిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు, కార్యకర్తలు మునుగోడుకు తరలిరావాలి. మునుగోడు ప్రజలారా ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను ఖతం చేయాలని కుట్ర చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు.

రెండు అధికార పార్టీలు డబ్బులతో గెలుద్దామని చూస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలివచ్చి పాల్వాయి స్రవంతికి అండగా ఉందాం. మునుగోడు మనకు అన్నం పెడుతుందని రేవంత్ పేర్కొన్నారు.