Revanth Reddy | ఆదివాసీలు.. గిరిజనులపై మోడీకి చిన్నచూపు: రేవంత్‌రెడ్డి
Revanth Reddy లోక్‌సభలో రేవంత్ ధ్వజం విధాత: ఆదివాసీలు, గిరిజనులంటే ప్రధాని మోడీకి చిన్నచూపని పీసీసీ చీఫ్, మల్కాజీగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం చర్చలో బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతు దేశంలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం రోజు కూడా ప్రధాని మోడీ లోక్‌సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టారు. మణిపూర్ ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచార ఘటనపైన, ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపైన కేంద్రం నిర్లక్ష్య ధోరణిని, మణిపూర్ హింసను అరికట్టడంలో మోడీ ప్రభుత్వ […]

Revanth Reddy
- లోక్‌సభలో రేవంత్ ధ్వజం
విధాత: ఆదివాసీలు, గిరిజనులంటే ప్రధాని మోడీకి చిన్నచూపని పీసీసీ చీఫ్, మల్కాజీగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం చర్చలో బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతు దేశంలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం రోజు కూడా ప్రధాని మోడీ లోక్‌సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టారు.
మణిపూర్ ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచార ఘటనపైన, ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపైన కేంద్రం నిర్లక్ష్య ధోరణిని, మణిపూర్ హింసను అరికట్టడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తు అవిశ్వాసానికి మద్ధతునిస్తున్నట్లుగా తెలిపారు.
బ్రిటీష్ జనతా పార్టీగా మారిన బీజేపీ బ్రిటీష్ విధానాన్ని అనుసరిస్తు మణిపూర్‌లో జాతీ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. రాముడిని, భజరంగ్ బలిని రాజకీయాలకు వాడుకునే బీజేపీకి కర్ణాటక ప్రజలు చెంపపెట్టువంటి తీర్పునిచ్చారన్నారు. ఎన్‌డిఏ అంటే నేషనల్ డివైడ్ అలయెన్స్‌గా రేవంత్ విమర్శించారు.
బీజేపీ పార్టీని వ్యక్తి ఆధారిత పార్టీగా ప్రధాని మోడీ మార్చారని, అలాగే వన్ నేషన్ వన్ పర్సన్ అన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారని రేవంత్ విమర్శించారు. లిక్కర్, నిక్కర్ పార్టీలు బీఆరెస్, బీజేపీలు కలిసి తెలంగాణను, దేశాన్ని దోచుకుంటున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఏటా 2కోట్లు ఉద్యోగాలిస్తామని చెబితే 22కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పటిదాకా 7,22,311ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు.
ప్రతి పేద వాడికి పక్కా ఇళ్లు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాల్లో 15లక్షలు వేస్తామని వేయలేదని, అందుకే ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదన్నారు. రేవంత్ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. ఆ వెంటనే అవిశ్వాసం పై చర్చకు హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం తరుపునా సమాధానం ఇవ్వడం ప్రారంభించారు.