Revanth Reddy | రాష్ట్ర సంపదను దోచుకున్న సీఎం కేసీఆర్ కుటుంబం: రేవంత్ రెడ్డి

పదేళ్ల పాలనలో 88వేల మంది రైతుల బలవన్మరణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్‌ Revanth Reddy | విధాత: తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ సంపదను, వనరులను దోచుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి దుయ్యబట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న […]

  • Publish Date - August 22, 2023 / 11:16 AM IST
  • పదేళ్ల పాలనలో 88వేల మంది రైతుల బలవన్మరణం
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్‌

Revanth Reddy | విధాత: తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ సంపదను, వనరులను దోచుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి దుయ్యబట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్ పేదల సంక్షేమాన్ని మరిచారని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని చేప్పిన హామీల్లో ఏ హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందన్నారు.

హైద్రాబాద్‌ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితి నెలకొందని, వరి వేస్తే ఉరే అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక 88వేల మంది రైతులు చనిపోయారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పేదలకు, దళితుల సంక్షేమానికి ప్రాథాన్యతనిస్తామన్నారు. గతంలో దళితులకు భూములు పంచింది, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తు చేశారు. పావలా వడ్డీ, బంగారు తల్లి పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రూ.4వేలు పెన్షన్ ఇచ్చి తీరుతామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు.